యూఏఈ నివాసితులు నెట్‌ఫ్లిక్స్ పాస్‌వర్డ్‌లను షేర్ చేయలేరు
- July 20, 2023
యూఏఈ: నేటి నుండి యూఏఈ నివాసితులు నెట్‌ఫ్లిక్స్ పాస్‌వర్డ్‌లను పంచుకోలేరు. అధికారికంగా పాస్వర్డ్-షేరింగ్ పై నెట్‌ఫ్లిక్స్ ఆంక్షలు విధించింది. దీంతో ఇంట్లో సభ్యులు తప్ప ఇతర ప్రాంతాల్లో పాస్ వర్డ్ ని ఉపయోగించలేరని కస్టమర్ సర్వీస్ ప్రతినిధి స్పష్టం చేశారు. "ఇప్పుడు ఒకే ఇంట్లో నివసిస్తున్న సభ్యులు మాత్రమే పాస్‌వర్డ్‌లను పంచుకోగలరు. ఒకే ఖాతాను ఉపయోగించగలరు" అని ప్రతినిధి చెప్పారు. వైఫై నెట్వర్క్, పరికరాల IP చిరునామా ఆధారంగా నెట్‌ఫ్లిక్స్ పాస్వర్డ్ షేరింగ్‌ని గుర్తించి అడ్డుకుంటుందని ప్రతినిధి వివరించారు. భారతదేశంలో నెట్‌ఫ్లిక్స్ ఈ రోజు నుండి పాస్వర్డ్ షేరింగ్‌ను రద్దు చేసినట్లు ప్రకటించింది. ఈ విధానానికి అనుగుణంగా Netflix కస్టమర్లు తమ ఖాతాలను భారతదేశంలోని వారి ఇంటి వెలుపలి వ్యక్తులతో భాగస్వామ్యం చేస్తున్నట్లు గుర్తించిన వారికి ఇమెయిల్‌లను పంపుతోంది. Mashable వెబ్సైట్ ప్రకారం.. అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, ఆస్ట్రేలియా, సింగపూర్, మెక్సికో, బ్రెజిల్ వంటి ముఖ్యమైన మార్కెట్లతో సహా 100 కంటే ఎక్కువ దేశాలలో పాస్వర్డ్ షేరింగ్‌పై పరిమితులను ఇప్పటికే అమల్లోకి వచ్చాయి. Netflix ఇప్పుడు చెల్లింపు చేసే కస్టమర్లను అదనపు నెలవారీ ఖర్చుతో అదనపు సభ్యుడిని యాడ్ చేసేందుకు అనుమతిస్తుంది.
తాజా వార్తలు
- కాగ్నిజెంట్ లో 25వేల మందికి ఉద్యోగాలు: CEO రవికుమార్
- కీలక నిర్ణయాలు తీసుకున్న కేంద్ర కేబినెట్
- భారీగా పౌరసత్వాన్ని వదులుకున్న భారతీయులు
- ప్రపంచ సమ్మిట్ AI..ఆకట్టుకుంటున్న ఖతార్ AI ప్రాజెక్టులు..!!
- GOSI 10వ ఎడిషన్ ఎలైట్ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- 2025లో యూఏఈ వీసా నియమాల్లో కీలక మార్పులు..!!
- కువైట్ లో పలు మీట్ షాప్స్ సీజ్..!!
- రసాయన ఆయుధాల నిషేధంపై కమిటీ ఏర్పాటు..!!
- టాక్సీ యజమానులకు జరిమానా మినహాయింపు..!!
- గూగుల్ జెమినీ 3కి పోటీగా chatgpt 5.2..







