జలమయం అయిన అహ్మదాబాద్ విమానాశ్రయం…
- July 23, 2023
అహ్మదాబాద్: గత రెండు రోజులుగా గుజరాత్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు సర్దార్ వల్లభాయ్ పటేల్ విమానాశ్రయం మోకాలు లోతు వరద నీటితో నిండిపోయింది. గుజరాత్ రాష్ట్రంలోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం ఆదివారం జలమయం అవడంతో వరదనీటిలోనే విమాన ప్రయాణికులు తిరుగుతున్న వీడియోలు వైరల్ అయ్యాయి.
కాంగ్రెస్ నాయకులతో సహా పలువురు సోషల్ మీడియా వినియోగదారులు విమానాశ్రయం వరదల్లో మునిగిపోయిందని, రన్వేలు, టెర్మినల్ ప్రాంతాలు నీటిలో మునిగిపోయాయని చూపించే వీడియోలను పంచుకున్నారు. అహ్మదాబాద్ విమానాశ్రయం టెర్మినల్ వెలుపల రోడ్డు నీటమునిగింది. భారీవర్షాలు, వరదల వల్ల విమానాల రాకపోకలకు అంతరాయం వాటిల్లింది. కాంగ్రెస్ జాతీయ సమన్వయకర్త దీపక్ ఖత్రీ అహ్మదాబాద్ విమానాశ్రయం టెర్మినల్ వెలుపల నీటిలో నిండిన రహదారి వీడియోను షేర్ చేశారు.
28 ఏళ్ల బీజేపీ పాలన తర్వాత గుజరాత్‌లోని అహ్మదాబాద్ విమానాశ్రయం పరిస్థితి దుస్థితి ఇదీ. ఇదీ నరేంద్ర మోదీకి ఆదర్శవంతమైన రాష్ట్రం అని కాంగ్రెస్ జాతీయ సమన్వయకర్త దీపక్ ఖత్రీ ట్వీట్ చేశారు. మరో యూజర్ అహ్మదాబాద్ టెర్మినల్ వీడియోను షేర్ చేస్తూ ఇది అదానీ మేనేజ్డ్ ఎయిర్ పోర్టు అని ట్వీట్ చేశారు.
గుజరాత్‌లోని దక్షిణ సౌరాష్ట్ర ప్రాంతాల్లోని పలు జిల్లాల్లో శనివారం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిశాయి. జునాగఢ్‌లో శనివారం సాయంత్రం 4 గంటల వరకు 8 గంటల్లో 219 మిల్లీమీటర్ల వర్షం కురియడంతో, పార్క్ చేసిన డజన్ల కొద్దీ కార్లు,పశువులు ప్రవహించే నీటిలో కొట్టుకుపోయాయి.
తాజా వార్తలు
- వాతావరణంలో రేడియేషన్ స్థాయిలపై కువైట్ క్లారిటీ..!!
- అల్పపీడన ద్రోణి..ఒమన్ వ్యాప్తంగా వర్షాలు..!!
- ప్రాంతీయ భద్రతపై రియాద్ లో కీలక సమావేశం..!!
- కువైట్ లో మార్చి 20న ఈద్ అల్-ఫితర్..!!
- ఖతార్ ఆహార భద్రతా వ్యవస్థ పటిష్ఠంగా ఉంది: ఫైసల్ అల్-థానీ
- ఈద్ అల్ ఫితర్: అబుదాబిలో 4 రోజుల పాటు ఉచిత పార్కింగ్..!!
- సున్నితమైన ఫోటోలు ఆన్లైన్లో పోస్ట్..కేసు నమోదు..!!
- 'రైల్ వన్’ యాప్‌లో ఉచిత OTT వినోదం!
- ‘దివ్యాంగ శక్తి’ పథకాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు..
- ఢిల్లీలో ఘోర అగ్నిప్రమాదం..ఆరుగురు సజీవదహనం!









