వృద్ధుల్లో నిద్రలేమి సమస్యా.?
- July 24, 2023వయసు మీద పడిన వారిలో ఎక్కువగా నిద్రలేమి సమస్యతో బాధపడుతుంటారు. వాస్తవానికి వయసు మీద పడ్డాకా 7 నుంచి 9 గంటల వరకూ నిద్ర ఖచ్చితంగా అవసరం అని నిపుణులు సూచిస్తున్నారు.
అయితే, నిద్ర సరిగ్గా పట్టాలంటే అందుకు తగిన ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలలో నిద్రలేమిని తగ్గించే పోషకాలు వుంటాయ్. ఇవి నిద్రను ప్రేరేపించే హార్మోన్లను ఉత్తేజ పరచడంలో తోడ్పడతాయ్.
అందుకే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా వుండే ఆహారం అధికంగా తీసుకోవాలి ఓ వయసుకొచ్చాకా. అయితే, అవి ఏ ఆహారంలో ఎక్కువగా లభిస్తాయ్.? చేపలు, గుడ్లు వంటి ఆహార పదార్ధాల్లో ఎక్కువగా ఈ ఫ్యాటీ యాసిడ్స్ లభిస్తాయ్. వారంలో కనీసం రెండు సార్లయినా ఈ పదార్ధాలను తమ ఆహారంలో వుండేలా చూసుకోవాలి.
శాఖాహారులైతే, పప్పులూ, వాల్ నట్స్‌తో పాటూ, పాలు, పాల సంబంధిత పదార్ధాలను ఎక్కువగా తీసుకోవాలి. ఈ పదార్ధాలు నిద్ర పట్టడానికి తోడ్పడే మెలటోనిన్ అనే హార్మోన్ అధికంగా ఉత్పత్తి అవ్వడానికి సహాయపడడంతో పాటూ, వయసు మీద పడిన వారు (వృద్ధులు) రోజంతా ఉత్సాహంగా వుండేందుకూ తోడ్పడతాయ్.
తాజా వార్తలు
- జగన్ విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్దొద్దు: కోర్టును కోరిన సీబీఐ
- ఒమన్ రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్‌లకు మంచి రోజులు..!
- జహ్రా గవర్నర్‌ను కలిసిన భారత రాయబారి
- 66కు పెరిగిన సౌదీ ఇ-విజిట్ వీసా పూల్ దేశాలు
- దుబాయ్‌లో కొత్త ట్రాఫిక్ ప్లాన్ కు ఆమోదం
- క్యాబిన్ క్రూ సంక్షోభం.. తగ్గనున్న ఎయిర్ ఇండియా సర్వీసులు..!
- షేక్ హజ్జా బిన్ సుల్తాన్ బిన్ జాయెద్ మృతికి సంతాపం తెలిపిన యూఏఈ ప్రెసిడెంట్
- దుబాయ్ లో పెరిగిన టాక్సీ ఛార్జీలు..!
- 'డార్క్ స్కై పాలసీ' ప్రకటించిన అబుదాబి
- ఎజార్: రెంటర్స్ నుండి ప్రాపర్టీ హామీ తప్పనిసరి..!