యూఏఈ లో 40 శాతం పెరిగిన ఇండియన్ రైస్ ధరలు..!
- July 26, 2023
యూఏఈ: బియ్యం ఎగుమతులపై భారతదేశం నిషేధం విధించిన తర్వాత యూఏఈలోని బియ్యం ధరలు 40 శాతం వరకు పెరిగాయని వ్యాపారులు తెలిపారు. అయితే, ఇది తాత్కాలిక సమస్య అని, కొత్త సరఫరాదారులు మార్కెట్లోకి ప్రవేశించిన తర్వాత త్వరలో ధరలు అందుబాటులోకి వస్తాయని రిటైలర్లు చెబుతున్నారు. వియత్నాం, థాయిలాండ్, పాకిస్తాన్ దేశాలలో రైస్ ఉత్పత్తి కొరత కారణంగా భారతదేశం ఎగుమతి నిషేధం తరువాత బాస్మతీయేతర బియ్యానికి యూఏఈలో డిమాండ్ ఏర్పడింది. బియ్యం ఎగుమతిలో భారతదేశం అతిపెద్ద బియ్యం ఎగుమతిదారులలో ఒకటిగా ఉంది. యూఏఈకి బియ్యం ఎగుమతుల్లో 40 శాతానికి పైగా వాటా ఇండియా కలిగిఉంది. గత సంవత్సరం మొత్తం 55.4 మిలియన్ మెట్రిక్ టన్నులు యూఏఈకి దిగుమతి అయ్యాయి. యూఏఈ దిగుమతిదారులకు బియ్యం దిగుమతి చేసుకునే ప్రధాన దేశఆలలో భారతదేశం తొలి ప్రాధాన్యత దేశంగా ఉందని అల్ మాయా గ్రూప్లో గ్రూప్ డైరెక్టర్, భాగస్వామి కమల్ వచాని తెలిపారు. స్థానిక వినియోగంలో బాస్మతీయేతర బియ్యం వాటా 45 శాతం, ఎక్కువగా దక్షిణ భారతీయులు వినియోగిస్తారని ఆయన అన్నారు. ధరలు 40 శాతం పెరిగే అవకాశం ఉందన్నారు. ఫలితంగా, నివాసితులు ఖరీదైన ప్రధాన ఆహారానికి మారడం వల్ల బాస్మతి బియ్యం డిమాండ్ కూడా పెరుగుతుందని ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







