కార్మిక హక్కుల పరిరక్షణకు బహ్రెయిన్ కట్టుబడి ఉంది: షేక్ నాసర్
- July 27, 2023
బహ్రెయిన్: రిపబ్లిక్ ఆఫ్ ఇటలీలోని రోమ్‌లో జరిగిన అభివృద్ధి, వలసలపై జరిగిన అంతర్జాతీయ సదస్సుకు హిస్ మెజెస్టి కింగ్ హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫా తరపున, జాతీయ భద్రతా సలహాదారు హిస్ హైనెస్ షేక్ నాసర్ బిన్ హమద్ అల్ ఖలీఫా హాజరయ్యారు. ఆయనతోపాటు విదేశాంగ మంత్రి డాక్టర్ అబ్దులతీఫ్ బిన్ రషీద్ అల్ జయానీ, స్టాఫ్ కల్నల్ షేక్ ఖలీద్ బిన్ జాబర్ అల్ ఖలీఫా, డిప్యూటీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్, రిపబ్లిక్ ఆఫ్ ఇటలీలోని బహ్రెయిన్ రాయబారి డాక్టర్ నాసర్ మహమ్మద్ అల్ బలూషి కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా షేక్ నాజర్ మాట్లాడుతూ.. కార్మిక హక్కులకు మద్దతు ఇవ్వడం, మానవ అక్రమ రవాణాను ఎదుర్కోవడంలో బహ్రెయిన్ దృఢ నిబద్ధత కలిగి ఉందన్నారు. కార్మిక మార్కెట్ వ్యవస్థలకు సంబంధించిన సవాళ్లను పరిష్కరించడానికి అంతర్జాతీయ సమిష్టి ప్రయత్నాలకు తమ మద్దతు ఉంటుందని చెప్పారు. అంతర్జాతీయ కార్మిక సంస్థ అంచనా ప్రకారం దాదాపు 25 మిలియన్ల మంది ప్రజలు మానవ అక్రమ రవాణాకు గురవుతున్నారని, వీరిలో 70 శాతం కంటే ఎక్కువ మంది మహిళలు, బాలికలు ఉన్నారని గుర్తుచేశారు. బహ్రెయిన్ రాజ్యం, హిజ్ మెజెస్టి కింగ్ హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫా నాయకత్వంలో అన్ని రకాల హ్యూమన్ ట్రాఫికింగ్ ను అరికట్టేందుకు పటిష్ఠమైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రపంచంలోని మూడవ అత్యంత జనసాంద్రత కలిగిన దేశంగా, బహ్రెయిన్ రాజ్యం తన బాధ్యతను చిత్తశుద్ధితో నిర్వర్తిస్తుందని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







