“ఇండియన్ ట్రావెల్ అవార్డ్స్ 2023”లో అవార్డు అందుకున్న ఒమన్
- July 27, 2023
మస్కట్: న్యూ ఢిల్లీలో జరిగిన “ఇండియన్ ట్రావెల్ అవార్డ్స్ 2023”లో భాగంగా పర్యాటక రంగంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న సంస్థగా ఒమన్ హెరిటేజ్ మరియు టూరిజం మంత్రిత్వ శాఖ అవార్డును కైవసం చేసుకుంది. ఇండియా నుండి జనవరి నుండి మే 2023 వరకు సందర్శకుల సంఖ్యలో సుల్తానేట్ ఆఫ్ ఒమన్ రికార్డు స్థాయి పెరుగుదల నమోదు చేసింది. అంతకుముందు సంవత్సరం ఇండియా నుండి ఒమన్‌ను 234,509 మంది సందర్శకులు సందర్శించారు. హెరిటేజ్ అండ్ టూరిజం మంత్రిత్వ శాఖలోని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ టూరిజం ప్రమోషన్‌లో అసిస్టెంట్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ టూరిజం ప్రమోషన్ అస్మా సలేమ్ అల్ హజ్రీ ఈ అవార్డును అందుకున్నారు. అస్మా అల్ హజ్రీ మాట్లాడుతూ.. ఈ అవార్డును గెలుచుకోవడం ఒమన్ సుల్తానేట్ సాధించిన విజయాన్ని సూచిస్తోందని, ఇది పర్యాటక రంగం సాధించిన అభివృద్ధిని ప్రతిబింబిస్తుందని, ప్రపంచంలోని వివిధ దేశాల నుండి పర్యాటకులను ఆకర్షించడానికి హెరిటేజ్ మరియు టూరిజం మంత్రిత్వ శాఖ చేసిన ప్రచార ప్రయత్నాలను ప్రతిబింబిస్తుందన్నారు. మరోవైపు జూలై 31 ఢిల్లీ, జైపూర్, కోల్‌కతా మరియు ముంబైలలో ఒమన్ పర్యాటక శాఖ వర్క్ షాపులును నిర్వహిస్తున్నది.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







