ఐసీసీ మెన్స్ క్రికెట్ వరల్డ్ కప్ ట్రోఫీ 2023 టూర్ రిజిస్ట్రేషన్ ప్రారంభం
- July 27, 2023
కువైట్: ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) మెన్స్ క్రికెట్ వరల్డ్ కప్ ట్రోఫీ 2023 టూర్‌ని కువైట్‌లో నిర్వహించేందుకు కువైట్ క్రికెట్ (కేసీసీ) రిజిస్ట్రేషన్ ను ప్రారంభించింది. సులైబియా క్రికెట్ గ్రౌండ్లో ఆగస్టు 10, 11 తేదీల్లో ప్రపంచ కప్ ట్రోఫీని ప్రదర్శించనున్నారు. క్రికెట్ ప్రపంచ కప్ ట్రోఫీ టూర్‌ను మొదటిసారిగా నిర్వహించడం పట్ల కేసీసీ ప్రెసిడెంట్ మిస్టర్ హైదర్ ఫర్మా హర్షం వ్యక్తం చేశారు. కువైట్ కు అవకాశాన్ని ఇచ్చిన ఐసీసీకి ధన్యవాదాలు తెలిపారు. ఈ ప్రతిష్టాత్మక అవకాశం కువైట్ రాష్ట్రంలోని క్రికెట్ క్రీడను ప్రొత్సహిస్తుందన్నారు.
ICC పురుషుల క్రికెట్ ప్రపంచ కప్ ట్రోఫీ ప్రపంచ వ్యాప్తంగా కువైట్, బహ్రెయిన్, మలేషియా, యూఎస్ఏ, నైజీరియా, ఉగాండా, ఫ్రాన్స్, ఇటలీ, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మరియు ఆతిథ్య దేశం భారతదేశంతో సహా 18 దేశాలకు వెళ్లనుంది. 2019 నుండి మొదటి పూర్తి స్థాయి ట్రోఫీ టూర్, 2023 ఎడిషన్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులను అలరించనుంది. ప్రపంచ కప్‌తో ఫోటో తీసుకోవడానికి, ఉచిత ప్రవేశం కోసం https://www.indiansinkuwait.com/campaign/worldcup/ లో పేర్లను నమోదు చేసుకోవచ్చు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







