‘భోళా శంకర్’ హిట్టు పక్కా బాస్.!

- July 27, 2023 , by Maagulf
‘భోళా శంకర్’ హిట్టు పక్కా బాస్.!

‘వాల్తేర్ వీరయ్య’ సినిమాతో ఇటీవల రికార్డులు కొల్లగొట్టిన మెగాస్టార్ చిరంజీవి, ఇప్పుడు ‘భోళా శంకర్’ అంటూ వస్తున్నారు. ఆగస్టు 11న ‘భోళా శంకర్’ ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ సందర్భంగా ఈ సినిమా నుంచి వస్తున్న ప్రచార చిత్రాలు ఒక్కొక్కటిగా దుమ్ము దులిపేస్తున్నాయనే చెప్పాలి. నిన్న, మొన్న వచ్చని ఆడియో సింగిల్స్‌తోనే చిరంజీవి, ఫ్యాన్స్‌ని ఖుషీ చేశారనుకుంటే, తాజాగా వచ్చిన ట్రైలర్ ఫ్యాన్స్‌లో పూనకాలు తెప్పిస్తోంది. ‘వాల్తేర్ వీరయ్య’కు సీక్వెల్‌ చూసినట్లుగా వుందంటూ ‘భోళా శంకర్’ ట్రైలర్‌ని తెగ ఎంజాయ్ చేస్తున్నారు అభిమానులు.

ఆ రేంజ్‌లో అన్ని రకాల కమర్షియల్ యాంగిల్స్‌నీ పుష్కలంగా నింపేశారు ఈ సినిమాలో. వాస్తవానికి ఒరిజినల్‌లో ఇంత ఎంటర్‌టై‌న్‌మెంట్ వుండదు. చిరంజీవి బాడీ లాంగ్వేజ్‌కి తగ్గట్లుగా తెలుగులో మెహర్ రమేష్ చేసిన మార్పులు అభిమానుల్ని ఉర్రూతలూగిస్తాయనడం అతిశయోక్తి కాదని ట్రైలర్ చూసి ఫిక్సయిపోయారు మెగా ఫ్యాన్స్.

కేవలం సోల్ మాత్రమే తీసుకుని, తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా, చిరంజీవిని అభిమానులు ఎలా చూడాలనుకుంటారో అందుకు తగ్గట్టుగానే ఆయన క్యారెక్టర్ డిజైన్ చేసినట్లు కనిపిస్తోంది. ఇంకేముంది మరో బ్లాక్ బాస్టర్ మెగా ప్యాన్స్ ‌‌కిచ్చేందుకు చిరంజీవి రెడీ అయిపోయారంతే.! 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com