వావ్.! మెగా ఛాన్స్ కొట్టేసిన మీనాక్షి.!
- July 27, 2023
‘ఇచ్చట వాహనాలు నిలపరాదు’ అనే ఓ చిన్న సినిమాతో టాలీవుడ్‌కి పరిచయమైన అందాల బ్యూటీ మీనాక్షి చౌదరి. తర్వాత ‘ఖిలాడీ’ సినిమాలో నటించి హిట్ కొట్టింది.
ఈ మధ్యనే అనుకోకుండా మహేష్ బాబు ‘గుంటూరు కారం’లో సూపర్ ఛాన్స్ కొట్టేసింది. పూజా హెగ్డే ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడంతో ఆ ప్లేస్ మీనాక్షిని వరించేసింది.
ఇక్కడితో అమ్మడి అదృష్టం ఆగినట్లు లేదండోయ్. మెగా కాంపౌండ్‌ని టచ్ చేసేసిందిప్పుడు. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కొత్త సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్గా ఎంపికైందట.
‘పలాస’ మూవీ డైరెక్టర్ కరుణ్ కుమార్‌తో వరుణ్ తేజ్ ఓ సినిమాకి కమిట్ అయ్యాడు. ఈ సినిమాకే మీనాక్షి చౌదరి, వరుణ్ తేజ్‌తో ఆన్ స్ర్కీన్ రొమాన్స్‌కి సిద్ధమైందట. ‘మట్కా’ అనే టైటిల్‌ని ఈ సినిమాకి ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ‘గాంఢీవధారి అర్జున’ సినిమాతో పాటూ, మరో సినిమాలోనూ వరుణ్ తేజ్ నటిస్తున్న సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ తొలి ఫోన్ సంభాషణ
- విజయవాడ మురుగునీటి నిర్వహణ ప్రాజెక్టుపై లోక్‌సభలో ఎంపీ బాలశౌరి ప్రశ్న
- మహిళలకు గుడ్ న్యూస్: త్వరలో ప్రత్యేక వెబ్సైట్
- హైదరాబాద్‌లో నెట్‌ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియోస్ ను గ్రాండ్ గా లాంచ్ చేసిన సీఎం రేవంత్
- విదేశాల్లో ఉన్న ప్రవాసులకు గుడ్ న్యూస్...
- అరుదైన రికార్డు సాధించిన వైజాగ్ పోర్టు
- యుద్ధం వల్ల నష్టపోయిన ప్రజలకు పరిహారం ఇస్తాం: మోజ్తాబా ఖమేనీ
- ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో మెడికవర్ ఆసుపత్రిని ప్రారంభించిన సీఎం రేవంత్
- మహిళా భద్రత కోసం తెలంగాణ పోలీస్ చర్యలు అభినందనీయం: జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ విజయ
- ఫారెస్ట్ అధికారుల పై సీఎం చంద్రబాబు సీరియస్









