త్రివిక్రమ్ ఇకపై అయినా మహేష్‌ని పట్టించుకుంటాడా.?
- July 27, 2023
తాను డైరెక్ట్ చేసే సినిమాల కన్నా, పవన్ కళ్యాణ్ సినిమాల పైనే ఎక్కువగా ఫోకస్ పెడుతున్నారు ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్. అవును, పవన్‌కి త్రివిక్రమ్ మంచి స్నేహితుడు. ఒకే మాట, ఒకే తీరు అన్నట్లుగా సాగుతుంటారు వీరిద్దరూ.
సెకండ్ ఇన్నింగ్స్‌లో పవన్ చేస్తున్న సినిమాలన్నింటి వెనకా త్రివిక్రమ్ హస్తం ఖచ్చితంగా వుంటూ వస్తోంది. ‘భీమ్లా నాయక్’ సినిమాకి రచనా సహకారం అందించారు. అలాగే, తాజా మూవీ ‘బ్రో’ కీ అన్నీ తానే అయ్యి వ్యవహరించారు.
ఈ నేపథ్యంలో ఆయన టేకప్ చేసిన ప్రాజెక్ట్ ‘గుంటూరు కారం’ కాస్త తటపటాయిస్తోందన్న ప్రచారం కూడా లేకపోలేదు. ఇక, ‘బ్రో’ రిలీజ్‌కి సిద్ధమైంది. సో, ఇక నుంచి త్రివిక్రమ్ ఫోకస్ అంతా ‘గుంటూరు కారం’పైనే పెట్టబోతున్నారట.
వీలైనంత త్వరగా ఈ సినిమాని పూర్తి చేసే పనిలో వున్నారట త్రివిక్రమ్ శ్రీనివాస్. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న ‘గుంటూరు కారం’, చివరి షెడ్యూల్ పనుల్లో బిజీగా వున్న సంగతి తెలిసిందే.
ఇక, గ్యాప్ తీసుకోకుండా ఈ సినిమాని పూర్తి చేసేయాలని అందుకు తగిన ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారట త్రివిక్రమ్ శ్రీనివాస్. చూడాలి మరి, ఏం జరుగుతుందో.!
తాజా వార్తలు
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!
- ఖతార్‌లో MotoGP, ఫార్ములా-1 గ్రాండ్‌ప్రి.. వాలంటీర్ల నమోదు ప్రారంభం..!!







