సముద్ర ఖని ‘బ్రో’ ఇంతటితో ఆగేదే లే.!
- July 27, 2023
తమిళ నటుడు కమ్ దర్శకుడు అయిన సముద్ర ఖని తెలుగులో తాజాగా తెరకెక్కించిన చిత్రం ‘బ్రో’. ఈ సినిమా తెలుగులో పురుడు పోసుకోవడానికి కారణం గురూజీ త్రివిక్రమ్ శ్రీనివాస్.. అని ఆయన బ్రో ప్రీ రిలీజ్ ఈవెంట్లో తెలిపారు.
ఈ కథకున్న బలానికి తెలుగులో ఓ స్టార్ హీరోతో సినిమా తెరకెక్కించాలని ఆశపడుతున్నా.. అని తన మనసులోని మాట చెప్పగానే కేవలం 10 నిముషాల్లోనే త్రివిక్రమ్ అంతా సెట్ చేసేశారట. పవన్ కళ్యాణ్ అయితే ఓకేనా.. అని పవన్‌ని ఈ సబ్జెక్ట్‌లోకి తీసుకొచ్చి, సాయి ధరమ్ తేజ్‌ని భాగం చేసి, ‘బ్రో’ని ఓ క్రేజీ ప్రాజెక్ట్‌గా తీర్చి దిద్దిన ఘనత ఆయనదే అని సముద్ర ఖని చెప్పారు.
టైమ్ సోల్‌తో నడిచే ఈ స్టోరీని ఇప్పటికే తమిళంలో సక్సెస్ చేసి, తెలుగులో రికార్డులు కొల్లగొట్టేందుకు సిద్ధమవుతున్నారు సముద్ర ఖని. అయితే, ఇంతటితో ఈ కథ ఆగేదేలేదట. ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 12 భాషల్లో ఈ స్టోరీని తెరకెక్కించాలని అనుకుంటున్నాడట సముద్రఖని. నెక్స్ట్ హిందీ రీమేక్‌పై ఫోకస్ పెట్టబోతున్నారనీ తెలుస్తోంది. చూడాలి మరి, సముద్ర ఖని అనుకున్నది సాధిస్తారో లేదో.!
తాజా వార్తలు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!
- ఖతార్‌లో MotoGP, ఫార్ములా-1 గ్రాండ్‌ప్రి.. వాలంటీర్ల నమోదు ప్రారంభం..!!
- దుబాయ్‌లో తక్కువ అద్దె ఇళ్లపై ప్రవాసుల ఆశలు.. కొత్త నిబంధనలతో ఊరట..!!
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్‌పోర్ట్‌కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు







