సముద్ర ఖని ‘బ్రో’ ఇంతటితో ఆగేదే లే.!

- July 27, 2023 , by Maagulf
సముద్ర ఖని ‘బ్రో’ ఇంతటితో ఆగేదే లే.!

తమిళ నటుడు కమ్ దర్శకుడు అయిన సముద్ర ఖని తెలుగులో తాజాగా తెరకెక్కించిన చిత్రం ‘బ్రో’. ఈ సినిమా తెలుగులో పురుడు పోసుకోవడానికి కారణం గురూజీ త్రివిక్రమ్ శ్రీనివాస్.. అని ఆయన బ్రో ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో తెలిపారు. 

ఈ కథకున్న బలానికి తెలుగులో ఓ స్టార్ హీరోతో సినిమా తెరకెక్కించాలని ఆశపడుతున్నా.. అని తన మనసులోని మాట చెప్పగానే కేవలం 10 నిముషాల్లోనే త్రివిక్రమ్ అంతా సెట్ చేసేశారట. పవన్ కళ్యాణ్ అయితే ఓకేనా.. అని పవన్‌ని ఈ సబ్జెక్ట్‌లోకి తీసుకొచ్చి, సాయి ధరమ్ తేజ్‌ని భాగం చేసి, ‘బ్రో’ని ఓ క్రేజీ ప్రాజెక్ట్‌గా తీర్చి దిద్దిన ఘనత ఆయనదే అని సముద్ర ఖని చెప్పారు.

టైమ్ సోల్‌తో నడిచే ఈ స్టోరీని ఇప్పటికే తమిళంలో సక్సెస్ చేసి, తెలుగులో రికార్డులు కొల్లగొట్టేందుకు సిద్ధమవుతున్నారు సముద్ర ఖని. అయితే, ఇంతటితో ఈ కథ ఆగేదేలేదట. ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 12 భాషల్లో ఈ స్టోరీని తెరకెక్కించాలని అనుకుంటున్నాడట సముద్రఖని. నెక్స్‌ట్ హిందీ రీమేక్‌పై ఫోకస్ పెట్టబోతున్నారనీ తెలుస్తోంది. చూడాలి మరి, సముద్ర ఖని అనుకున్నది సాధిస్తారో లేదో.!

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com