బిల్డింగ్‌ మెటీరియల్‌కి క్వాలిటీ సర్టిఫికెట్‌

- May 16, 2016 , by Maagulf
బిల్డింగ్‌ మెటీరియల్‌కి క్వాలిటీ సర్టిఫికెట్‌

క్వాలిటీ సర్టిఫికెట్‌ లేకుండా ఎలాంటి బిల్డింగ్‌ మెటీరియల్‌ ఖతార్‌లోకి అనుమతించబడదని అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఖతార్‌ కన్‌స్ట్రక్షన్స్‌ స్పెసిఫికేషన్స్‌ (క్యూసిఎస్‌)కి లోబడి మాత్రమే బిల్డింగ్‌ మెటీరియల్‌ అనుబతించబడతాయని మినిస్ట్రీ ఆఫ్‌ మునిసిపాలిటీ అండ్‌ ఎన్విరాన్‌మెంట్‌ ప్రకటించింది. మినిస్ట్రీ గబ్రో, లైమ్‌స్టోన్‌లకు క్యుసిఎస్‌ ప్రకారం సర్టిఫికెట్లు మంజూరు చేస్తుందని మినిస్ట్రీకి చెందిన లేబరేటరీస్‌ అండ్‌ స్పెసిఫికేషన్స్‌ అండర్‌ సెక్రెటరీ మొహమ్మద్‌ బిన్‌ సైఫ్‌ అల్‌ కువారి వెల్లడించారు. ఖతార్‌లోకి వచ్చే అన్ని దారుల్లోనూ చెకింగ్‌ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయబడ్డాయని, అక్కడే శాంపిల్స్‌ని పరీక్షించడం జరుగుతుందని ఆయన చెప్పారు. ప్రజలు కూడా క్యుసిఎస్‌ పట్ల అప్రమత్తంగా ఉండాలని, అవగాహనతో వ్యవహరించాలని ఆయన కోరారు. స్టీల్‌, రెడీమిక్స్‌ వంటివాటికి కూడా ఈ నిబంధనలు వర్తిస్తాయి. ఖతార్‌ ప్రైమరీ మెటీరియల్స్‌ కంపెనీ (క్యుపిఎంసి) సీఈఓ ఎంగ్‌ ఇసా హమ్మాది మాట్లాడుతూ, 60 శాతం లోకల్‌ మార్కెట్‌కీ, 40 శాతం ఐవేట్‌ సెక్టార్‌కీ పంపించేలా తమ వద్ద స్టాక్‌ ఉంటుందని, తమతోపాటు 58 లైసెన్స్‌డ్‌ ప్రైవేట్‌ సప్లయర్స్‌ ఉన్నారని, తమ మెటీరియల్‌ అంతా స్టాండర్డ్స్‌కి తగ్గట్లుగా ఉంటుందని వివరించారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com