డోన్ట్ మిస్. ఆగస్ట్ నెలలో 2 సూపర్మూన్లు
- July 29, 2023
ఆగస్ట్ నెలలో యూఏఈ ఆకాశంలో రెండు సూపర్మూన్లు రానున్నాయి. మొదటిది ఆగస్టు 1న, రెండోది ఆగస్టు 30న ఆకాశంలో కనిపించనున్నది. ఈ మేరకు దుబాయ్ ఆస్ట్రానమీ గ్రూప్ (DAG) ఆగస్టు 1న రాత్రి 7 గంటల నుండి 9 గంటల వరకు అల్ తురయా ఆస్ట్రానమీ సెంటర్, ముష్రిఫ్ పార్క్‌లో సూపర్‌మూన్ అబ్జర్వేషన్ ఈవెంట్‌ను నిర్వహించనుంది. ప్రత్యేక స్కైవాచింగ్ ఈవెంట్ DAG సభ్యులందరికీ.. ప్రజలకు నిర్దిష్ట రుసుముతో ఉచితంగా అందించనుంది. ఈ సందర్భంగా సూపర్మూన్లు, టెలిస్కోప్ పరిశీలన, DAG టెలిస్కోప్‌ల ద్వారా చంద్రుని ఫోన్ ఫోటోగ్రఫీ గురించి చర్చవేదికను నిర్వహించనున్నారు.
సూపర్ మూన్ అంటే ఏమిటి?
DAG ప్రకారం.. సూపర్‌మూన్ అనేది పౌర్ణమి లేదా అమావాస్య. ఇది దాదాపు పెరిజీతో సమానంగా ఉంటుంది. చంద్రుడు దాని దీర్ఘవృత్తాకార కక్ష్యలో భూమికి దగ్గరగా వచ్చే సమయం. దీని ఫలితంగా చంద్రుడు సాధారణం కంటే పెద్దదిగా కనిపిస్తుంది. ఒక సూపర్‌మూన్ పరిమాణం 8 శాతం, పౌర్ణమి వెలుగు 16 శాతం అధికంగా ఉంటుంది. ఖగోళ శాస్త్రవేత్తల ప్రకారం.. ఆగస్ట్ 30-31 సూపర్ మూన్ 2023కి అత్యంత దగ్గరగా, ప్రకాశవంతంగా కనిపిస్తుంది. ఆ సమయంలో చంద్రుడు భూమికి 357,343 కిలోమీటర్ల దూరంలో ఉంటాడు. తదుపరి పూర్తి సూపర్‌మూన్ నవంబర్ 5, 2025న ఏర్పడుతుంది. ఆ సమయంలో చంద్రుడు భూమికి 356,979కిమీ దూరంలో ఉంటుంది.
తాజా వార్తలు
- సైనిక ప్రతీకారం 'కచ్చితంగా' చర్చకు వస్తుంది: యూఏఈ అధ్యక్షుడి దౌత్య సలహాదారు అన్వర్ గార్గాష్
- భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు
- టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడికి హైదరాబాద్ కోర్టులో ఊరట
- తెలంగాణ లో మహిళా పెట్రోల్ బంకులు
- ఇద్దరు ఇరానియన్ రివల్యూషనరీ గార్డ్ సెల్స్ అరెస్ట్: ఖతార్
- 166 మిస్సైల్స్, డ్రోన్లను ధ్వంసం చేశాం: బహ్రెయిన్
- కువైట్ పై దాడులకు తెగబడ్డ ఇరాన్..!!
- కువైట్‌లో సైనికుల మృతి పట్ల ఒమన్ సంతాపం..!!
- దౌత్యాధికారులకు ఇఫ్తార్ విందు ఇచ్చిన సౌదీ అరేబియా..!!
- డిస్టెన్స్ లెర్నింగ్ మార్చి 6 వరకు పొడిగించిన యూఏఈ..!!









