గల్ఫ్ దేశాల్లో నివసిస్తున్న88.8 లక్షల మంది ఎన్నారైలు
- July 30, 2023
కువైట్ : మార్చి 2022 నాటికి 1.34 కోట్ల మంది ప్రవాస భారతీయులలో 66 శాతానికి పైగా గల్ఫ్ దేశాలైన యూఏఈ, సౌదీ అరేబియా, కువైట్, ఖతార్, ఒమన్ మరియు బహ్రెయిన్‌లలో ఉన్నారని విదేశాంగ మంత్రిత్వ శాఖ RTI సమాధానంలో తెలిపింది. 210 దేశాల్లో 1.34 కోట్ల మంది ఎన్నారైలు నివసిస్తున్నారని ఆర్టీఐకి సమాధానంగా మంత్రిత్వ శాఖ తెలిపింది. వీరిలో 88.8 లక్షల మంది విదేశీ భారతీయులు ఆరు గల్ఫ్ దేశాల్లో నివసిస్తున్నారు.
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో 34.1 లక్షల మంది ఎన్నారైలు నివసిస్తుండగా, సౌదీ అరేబియాలో 25.9 లక్షలు, కువైట్‌లో 10.2 లక్షలు, ఖతార్‌లో 7.4 లక్షలు, ఒమన్‌లో 7.7, బహ్రెయిన్‌లో 3.2 లక్షల మంది ఉన్నారు. ఇక అమెరికాలో 12.8 లక్షల మంది ఎన్నారైలు నివసిస్తున్నారు. యూకేలో 3.5 లక్షలు, ఆస్ట్రేలియాలో 2.4 లక్షలు, మలేషియాలో 2.2 లక్షలు, కెనడాలో 1.7 లక్షలు మంది ఉన్నారు. ఇతర దేశాలతో పోలిస్తే అమెరికాలోనే అత్యధిక పీఐఓలు(31 లక్షల మంది,) ఉన్నారని ఆర్టీఐ సమాధానంలో పేర్కొంది. ఆ తర్వాత మలేషియాలో 27.6 లక్షలు, మయన్మార్‌లో 20 లక్షలు, శ్రీలంకలో 16 లక్షలు, కెనడాలో 15.1 లక్షల మంది ఉన్నారు.
తాజా వార్తలు
- కువైట్‌లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్‌లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!
- ఫ్రీ ఫుడ్ కంటే హెల్త్ ఇన్సూరెన్స్, ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్కే ప్రాధాన్యం..!!
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!
- పాఠశాలల కోసం ‘బ్యాక్ టు స్కూల్’.. PHCC హెల్త్ క్యాంపెయిన్..!!







