బహ్రెయిన్‌లో భారతీయ జనాభా 320,000
- July 31, 2023
బహ్రెయిన్: అధికారిక ప్రభుత్వ గణాంకాల ప్రకారం.. బహ్రెయిన్‌లో ప్రవాస భారతీయుల (NRI) జనాభా ఇప్పుడు 320,000 కు చేరింది. గల్ఫ్ దేశాలు 8.8 మిలియన్లకు పైగా ఎన్నారైలు నివసిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఈ 13.4 మిలియన్ల NRIలలో GCC దేశాలు 66 శాతం కంటే ఎక్కువ వాటాను కలిగి ఉన్నాయి. భారతదేశం విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించిన డేటా ప్రకారం.. మార్చి 2022 వరకు UAE 3.41 మిలియన్ల NRIలతో ఈ ప్రాంతంలో అగ్రస్థానంలో ఉంది. 2.59 మిలియన్ల ఎన్ఆర్ఐలతో సౌదీ అరేబియా, 1.02 మిలియన్లతో కువైట్, 740,000 మందితో ఖతార్, 770,000 మందితో ఒమన్, 320,000 ఎన్ఆర్ఐలతో బహ్రెయిన్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. అమెరికాలో 1.28 మిలియన్లు, యూకేలో 350,000 మంది ఉన్నారు. బహ్రెయిన్‌లో NRIలు దేశం విభిన్న సాంస్కృతిక, ఆర్థిక అభివృద్ధికి గణనీయంగా దోహదం చేస్తున్నారు. బహ్రెయిన్, భారతదేశం మధ్య బలమైన సంబంధాలు, అభివృద్ధి చెందుతున్న ద్వైపాక్షిక సంబంధానికి ఇది ప్రతిబింబిస్తుంది.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







