రేడియో ఫ్రీక్వెన్సీల వినియోగం ధరలపై పబ్లిక్ కన్సల్టేషన్‌ ప్రారంభం

- July 31, 2023 , by Maagulf
రేడియో ఫ్రీక్వెన్సీల వినియోగం ధరలపై పబ్లిక్ కన్సల్టేషన్‌ ప్రారంభం

మస్కట్: రేడియో ఫ్రీక్వెన్సీలు, పరికరాల రిజిస్ట్రేషన్, వినియోగాన్ని నియంత్రించడం, వాటి ధరలను నిర్ణయించడం కోసం పబ్లిక్ కన్సల్టేషన్‌ను టెలికమ్యూనికేషన్స్ రెగ్యులేటరీ అథారిటీ (TRA)  ప్రారంభించింది. TRA ట్విట్టర్ అకౌంట్, వెబ్‌సైట్ ద్వారా ప్రారంభించబడిన ఈ సంప్రదింపులు ఒమన్‌లో టెలికమ్యూనికేషన్ మార్కెట్ అవసరాలను తీర్చేందుకు,  అంతర్జాతీయ టెలికమ్యూనికేషన్ యూనియన్, అంతర్జాతీయ సంస్థల సిఫార్సులు.. నిర్ణయాలకు అనుగుణంగా TRA నియంత్రణని సవరించడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు అథారిటీ వెల్లడించింది.  సంప్రదింపులు TRA మార్గదర్శకం నియంత్రణ, రేడియో కమ్యూనికేషన్ల టెక్నాలజీ వేగవంతమైన అభివృద్ధికి అనుగుణంగా వినూత్న వ్యాపార నమూనాలకు (స్థానికంగా) మద్దతు ఇవ్వడం, టెలికమ్యూనికేషన్ సేవల నాణ్యతను అప్‌గ్రేడ్ చేయడం వంటి 4 దశలలో ఉంటుందన్నారు.  TRA నిబంధనలను, సంబంధిత వ్యవస్థలను రూపొందించడంలో లబ్ధిదారులు, వాటాదారులను కలిగి ఉంటుందని తెలిపింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com