ఆగస్టులో ఉక్రేనియన్ శాంతి చర్చలకు సౌదీ అరేబియా ఆతిథ్యం..!
- July 31, 2023
జెడ్డా: సౌదీ అరేబియా ఆగస్టు 5, 6 తేదీలలో ఉక్రేనియన్ శాంతి చర్చలకు ఆతిథ్యం ఇవ్వనుంది.ఈ సమావేశాలకు ఇండియా, బ్రెజిల్‌తో సహా ప్రధాన అభివృద్ధి చెందుతున్న దేశాలను ఆహ్వానిస్తున్నట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ శనివారం తెలిపింది. ఈ సమావేశంలో ఇండోనేషియా, ఈజిప్ట్, మెక్సికో, చిలీ, జాంబియాతో సహా 30 దేశాలకు చెందిన సీనియర్ దౌత్యవేత్తలు ఈ చర్చలో పాల్గొనే అవకాశం ఉందన్నారు. ఈ చర్చలు ఉక్రెయిన్‌కు అనుకూలమైన శాంతి నిబంధనలకు అంతర్జాతీయ మద్దతునిస్తాయని ఉక్రెయిన్, యూరప్ కంట్రీస్ భావిస్తున్నాయి. వీరితోపాటు బ్రిటన్, దక్షిణాఫ్రికా, పోలాండ్ ఈయూ ప్రతినిధులు, అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్ సుల్లివన్ హాజరవుతారని భావిస్తున్నారు. మే నెలలో ఉక్రేనియన్ ప్రెసిడెంట్ వోలోడిమిర్ జెలెన్స్కీ జెడ్డాలో అరబ్ లీగ్ సమ్మిట్‌కు హాజరైనందున సౌదీ అరేబియా చర్చలకు ఆతిథ్యం ఇచ్చింది. ఫిబ్రవరి 2022లో రష్యా ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని ప్రారంభించినప్పటి నుండి అరబ్ దేశాలు చాలా వరకు తటస్థంగా వ్యవహారిస్తున్నాయి.
తాజా వార్తలు
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!







