కువైట్ చమురు మంత్రిత్వ శాఖలో మొదటి ఏఐ ఉద్యోగి 'నౌఫ్'
- August 01, 2023
కువైట్: కొత్త ఎలక్ట్రానిక్ కంటెంట్‌ను రూపొందించాలని లక్ష్యంగా పెట్టుకున్న మంత్రిత్వ శాఖలు మరియు చమురు రంగాల స్థాయిలో మొట్టమొదటిసారిగా కృత్రిమ మేధస్సు(ఏఐ) టెక్నాలజీని ఉపయోగించి చమురు మంత్రిత్వ శాఖ మొదటి పుస్తకాన్ని సోమవారం ప్రారంభించింది. ఇది దేశంలో చమురు పరిశ్రమను అభివృద్ధి చేయడంలో చేస్తున్న ప్రయత్నాలను సమీక్షిస్తుందని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ సందర్భంగా చమురు మంత్రిత్వ శాఖలో ఏఐ టెక్నాలజీతో పని చేస్తున్న తొలి మహిళా ఉద్యోగి నౌఫ్ ఫోటోని విడుదల చేశారు. వర్చువల్ ప్రెజెంటర్కు 'నౌఫ్' అనే పేరు పెట్టారు. ఆమె AI సాంకేతికతతో పని చేస్తున్న మొదటి మహిళా ఉద్యోగి అవుతుంది. కువైట్‌లో అతిథులు, చమురు వ్యవహారాలపై ఆసక్తి ఉన్నవారితో సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో మంత్రిత్వ శాఖ కొత్త మీడియా ఆమె వ్యవహారిస్తుందని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ పుస్తకం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని ఉపయోగించి చమురు మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ పుస్తకం ఇప్పుడు ఆయిల్ మంత్రిత్వ శాఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లైన యూట్యూబ్, ఎక్స్ మరియు ఇన్‌స్టాగ్రామ్‌లలో అందుబాటులో ఉందని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







