మరోసారి ఉలిక్కిపడిన హైదరాబాద్..
- August 01, 2023
హైదరాబాద్: హైదరాబాద్లో మరో టెర్రరిస్ట్ అరెస్ట్ తీవ్ర కలకలం రేపుతుంది.. గతంలో మధ్యప్రదేశ్ తెలంగాణ పోలీసులు జరిపిన సోదాల్లో హైదరాబాదులో ఆరుగురు అరెస్ట్ అయితే వాళ్లతో సంబంధం ఉన్న మరొక వ్యక్తిని ఎన్ఐఏ (జాతీయ దర్యాప్తు సంస్థ) అధికారులు మంగళవారం అరెస్ట్ చేశారు..
HUT అనే ఉగ్రవాద సంస్థకు చెందిన ఆరుగురిని హైదరాబాదులో గతంలో మధ్యప్రదేశ్ ఏటీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు.. ఆ తర్వాత ఆ కేసు ఎన్ఐఏకి బదిలీ అయింది. దీంతో జాతీయ దర్యాప్తు సంస్థ ఈ కేసుని వేగవంతంగా దర్యాప్తు కొనసాగిస్తుంది. ఈ క్రమంలో మధ్యప్రదేశ్ – తెలంగాణ మాడ్యుల్ కేసులో మరొక వ్యక్తిని అరెస్ట్ చేసింది. దీంతో అరెస్టయిన వారి సంఖ్య 17కు చేరింది.
మే 24వ తేదీన కేసు నమోదు చేసిన ఎన్ఐఏ అధికారులు, ఈ కేసులో హట్ తో సంబంధం ఉన్న అనేక మంది వ్యక్తులను అరెస్ట్ చేసింది. హైదరాబాదులో అరెస్ట్ అయిన సల్మాన్ రాజేంద్రనగర్ లో తలదాచుకుని ఉండగా ఎన్ఐఏ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. అనంతరం సల్మాన్ కు చెందిన రెండు ఇళ్లలో అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. హట్ ద్వారా సల్మాన్ రిక్రూట్ మెంట్ చేస్తున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. సల్మాన్ ఇంటి నుంచి కీలక పత్రాలతోపాటు.. పలు ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం..
గతంలో జరిగిన అరెస్టులు మర్చిపోకముందే మరొక టెర్రరిస్ట్ హైదరాబాద్లో అరెస్ట్ కావడంతో.. మరోసారి నగరంలో అలజడి మొదలైంది. ఇతర రాష్ట్రాలకు చెందిన టెర్రరిస్టులకు హైదరాబాద్ షెల్టర్ గా మారిందని విమర్శలు వినిపిస్తున్నాయి.. గత రెండేళ్లుగా వరుసగా టెర్రరిస్ట్ కు సంబంధించిన సానుభూతిపరులు పోలీసులకు పట్టుబడుతున్నట్టు హైదరాబాద్ పేరు మరొకసారి చర్చనీయాంశంగా మారింది.
తాజా వార్తలు
- OTT కంటెంట్ హెచ్చరిక
- ఘోర రైలు ప్రమాదం..11 మంది దుర్మరణం..
- సందీప్ మక్తాలకు యూఏఈ గోల్డెన్ వీసా
- సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు–జీహెచ్ఎంసీ సమన్వయ సమావేశం
- 2,937 మంది ఖైదీలకు యూఏఈ అధ్యక్షుడు క్షమాభిక్ష..!!
- సౌదీ, స్పానిష్ మధ్య సహకార ఒప్పందం..!!
- ఖసాబ్లో 13 మంది ఆసియన్లు అరెస్టు..!!
- సహకార సంఘాల ప్రైవేటీకరణ..కువైట్ క్లారిటీ..!!
- AUB గ్లోబల్ ఎంటర్ప్రెన్యూర్షిప్ వీక్ 2025..!!
- ఏఐ vs డాక్టర్స్? ఎంపిక మీదే..!!







