ఆగస్టు 5 నుంచి ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్..
- August 01, 2023
ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ రాబోయే గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ ఈవెంట్ ఆగష్టు 5న జరుగుతుందని ప్రకటించింది. ఇప్పుడు, ఫ్లిప్‌కార్ట్ ప్లాట్‌ఫారమ్ స్వాతంత్ర్య దినోత్సవానికి కొద్ది రోజుల ముందు.. బిగ్ సేవింగ్ డేస్ సేల్‌ను ధృవీకరించింది. ఈ ఫ్లిప్‌కార్ట్ సేల్ ఆగస్ట్ 4న ప్రారంభమై ఆగస్టు 9 వరకు కొనసాగుతుంది. ఇప్పటికే దీనిపై టీజర్‌ను రివీల్ చేసింది. విక్రయానికి రానున్న కొన్ని ఫోన్‌ల లిస్టును వెల్లడించింది.
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ సమయంలో ఐఫోన్ 14, ఐఫోన్ 11 లాంచ్ చేయనుంది. భారత మార్కెట్లో తక్కువ ధరకు అందుబాటులో ఉంటాయి. ప్రస్తుతం, డివైజ్ ప్లాట్‌ఫారమ్‌లో వరుసగా రూ.68,999, రూ. 41,999కి కొనుగోలు చేయొచ్చు. ధర చాలా తక్కువగా ఉంటుంది. ఈ ప్లాట్‌ఫారమ్ కొన్ని పాపులర్ 5G ఫోన్‌లపై భారీ డిస్కౌంట్లను అందించిన రికార్డును కూడా కలిగి ఉంది. అందుకే, కొత్త స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకునే వినియోగదారులు మరికొన్ని రోజులు ఆగాల్సిందే.
అదనంగా, సేల్ సమయంలో ఐఫోన్ 14 ప్లస్‌పై కూడా డిస్కౌంట్ అందిస్తుంది. మినీ సిరీస్ స్థానంలో ఆపిల్ 2022లో ప్లస్ వెర్షన్‌ను ప్రవేశపెట్టింది. కానీ, కొత్త ప్లస్ వెర్షన్‌కు కంపెనీ బెస్ట్ సేల్ రెస్పాన్స్‌ను అందుకోలేదని నివేదికలు చెబుతున్నాయి. ఐఫోన్ 14 స్మార్ట్‌ఫోన్ మాదిరిగా అదే ఫోన్ చాలా పెద్ద డిస్‌ప్లే, కొంచెం పెద్ద బ్యాటరీ యూనిట్‌తో ఉంటుంది.
తాజా వార్తలు
- OTT కంటెంట్ హెచ్చరిక
- ఘోర రైలు ప్రమాదం..11 మంది దుర్మరణం..
- సందీప్ మక్తాలకు యూఏఈ గోల్డెన్ వీసా
- సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు–జీహెచ్ఎంసీ సమన్వయ సమావేశం
- 2,937 మంది ఖైదీలకు యూఏఈ అధ్యక్షుడు క్షమాభిక్ష..!!
- సౌదీ, స్పానిష్ మధ్య సహకార ఒప్పందం..!!
- ఖసాబ్లో 13 మంది ఆసియన్లు అరెస్టు..!!
- సహకార సంఘాల ప్రైవేటీకరణ..కువైట్ క్లారిటీ..!!
- AUB గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ వీక్ 2025..!!
- ఏఐ vs డాక్టర్స్? ఎంపిక మీదే..!!







