హైదరాబాద్ లో రెండు భారీ అగ్నిప్రమాదాలు
- August 02, 2023
హైదరాబాద్: హైదరాబాద్ లో ఈ మధ్య వరుస అగ్ని ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ ప్రమాదాల వాళ్ళ భారీగా ఆస్థి నష్టంతో పాటు ప్రాణ నష్టం వాటిల్లుతుంది. తాజాగా బుధవారం తెల్లవారుజామున రెండు అగ్నిప్రమాదాలు కలకలం రేపుతున్నాయి. హబ్సీగూడాలో, అత్తాపూర్ లో భారీ అగ్ని ప్రమాదాలు చోటుచేసుకున్నాయి.
హబ్సిగూడలోని అన్ లిమిటెడ్ షోరూంలో మంగళవారం అర్థరాత్రి దాటిన తరువాత మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న ఫైర్అ సిబ్బంది మూడు ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపుచేస్తున్నారు. ఉప్పల్ – సికింద్రాబాద్ ప్రధాన రహదారి కావడంతో పొగతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. ఘటనా స్థలం పక్కనే పెట్రోల్ బంక్ ఉండడంతో స్థానికులు భయాందోళనలో ఉన్నారు.
మరో వైపు అత్తాపూర్ హసన్ నగర్ లో కూడా భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఓ బట్టల గోదాంలో మంటలు చెలరేగాయి. దీంతో దట్టమైన పొగ వ్యాప్తితో స్థానికులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. రెండు ఫ్లోర్లలో వ్యాపించిన మంటలను అగ్నిమాపక సిబ్బంది ఆర్పుతున్నారు. మంటలు మరింత వ్యాపించకుండా అధికారుల చర్యలు చేపట్టారు. సమీప ఇళ్లకు మంటలు వ్యాపించకుండా అధికారులు చర్యలు చేపట్టారు. ఇలా ఒకేరోజు రెండు అగ్ని ప్రమాద ఘటనలు చోటుచేసుకున్నాయి.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







