అల్-అహ్సా లో అత్యధిక ఉష్ణోగ్రత నమోదు
- August 02, 2023
ధమ్మం: సౌదీ అరేబియాలోని తూర్పు ప్రావిన్స్‌లోని అల్-అహ్సా గవర్నరేట్ ఈ సంవత్సరం సౌదీ అరేబియాలో రెండవ అత్యధిక ఉష్ణోగ్రతను నమోదైంది. సోమవారం 50 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకుందని జాతీయ వాతావరణ కేంద్రం (NCM) వెల్లడించింది. జూలై 18న 51 డిగ్రీల సెల్సియస్ నమోదు కాగా.. దాదాపు 13 రోజుల తర్వాత మరోసారి అధిక ఉష్ణోగ్రత రికార్డైంది. దమ్మామ్ నగరంలో సోమవారం 49 డిగ్రీల సెల్సియస్ నమోదు కాగా, హఫర్ అల్-బాటిన్ గవర్నరేట్‌లోని ఖైసుమా, అల్-ఖాసిమ్ ప్రాంతంలోని బురైదాలో 46 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. రియాద్, షరూరా, వాడి అల్-దవాసిర్ మరియు రఫాలో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకున్నాయి. కొన్ని రోజులుగా 46- 50 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. మరోవైపు తూర్పు ప్రావిన్స్, మధ్య ప్రాంతంలోని కొన్ని ప్రాంతాల్లో వాతావరణం చాలా వేడిగా ఉంటుందని, గరిష్ట ఉష్ణోగ్రతల కారణంగా దుమ్ము తుఫాను చెలరేగే అవకాశం ఉందని, వాహనదారులు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. అదే సమయంలో తూర్పు ప్రావిన్స్‌లో 48- 50 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. అయితే రియాద్ ప్రాంతంలోని తూర్పు, దక్షిణ ప్రాంతాలలో 46-48 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని జాతీయ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
తాజా వార్తలు
- OTT కంటెంట్ హెచ్చరిక
- ఘోర రైలు ప్రమాదం..11 మంది దుర్మరణం..
- సందీప్ మక్తాలకు యూఏఈ గోల్డెన్ వీసా
- సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు–జీహెచ్ఎంసీ సమన్వయ సమావేశం
- 2,937 మంది ఖైదీలకు యూఏఈ అధ్యక్షుడు క్షమాభిక్ష..!!
- సౌదీ, స్పానిష్ మధ్య సహకార ఒప్పందం..!!
- ఖసాబ్లో 13 మంది ఆసియన్లు అరెస్టు..!!
- సహకార సంఘాల ప్రైవేటీకరణ..కువైట్ క్లారిటీ..!!
- AUB గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ వీక్ 2025..!!
- ఏఐ vs డాక్టర్స్? ఎంపిక మీదే..!!







