‘ఉస్తాద్’ ఆగిపోలేదా.?
- August 02, 2023
హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న పవన్ కళ్యాణ్ సినిమా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఆగిపోయిందంటూ ఈ మధ్య జోరుగా ప్రచారం జరిగుతోంది. మొన్న జరిగిన ‘బ్రో’ ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కి హరీష్ శంకర్ రాకపోవడానికి కారణం కూడా ఇదే అన్న అనుమానం కూడా లేకపోలేదు. సినిమా అప్డేట్ గురించి అడిగితే ఏం చెప్పాలో తెలియకే హరీష్ ఆగిపోయాడన్న వాదన వుంది.
అయితే, అలాంటిదేమీ లేదనీ, తాజా పరిణామాల దృష్ట్యా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ షూటింగ్ కోసం జోరుగా ఏర్పాట్లు చేస్తున్నారనీ తెలుస్తోంది. ప్రస్తుత రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఎక్కువగా ఏపీలోనే పవన్ కళ్యాణ్ గడపాల్సి వస్తుంది.
ఈ క్రమంలో ఆ పరిసర ప్రాంతాల్లోనే సెట్స్ వేసి, హరీష్ శంకర్ సైలెంట్‌గా షూటింగ్ కానిచ్చేయబోతున్నాడట. పవన్ కళ్యాణ్ లేని సీన్లను హైద్రాబాద్‌లో షూట్ చేయబోతున్నారట. ఇలా ఓ పక్కా ప్లానింగ్‌తో ‘ఉస్తాద్’ కంప్లీట్ చేసేసే యోచనలో వున్నట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత







