చిన్న హీరోకి కమిట్ అయిన రష్మిక మండన్నా.?
- August 02, 2023
తెలుగులో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందుతోన్న రష్మిక మండన్నా, ప్రస్తుతం బాలీవుడ్ ప్రాజెక్టులతో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. తెలుగు ప్రాజెక్టులను పట్టించుకోలేనంత బిజీగా వుంది రష్మిక మండన్నా.
ఈ క్రమంలోనే తెలుగులో ఆల్రెడీ కమిట్ అయిన ‘పుష్ప 2’లో రష్మిక మండన్నా నటిస్తోంది. దీంతో పాటూ, ఓ హీరోయిన్ సెంట్రిక్ మూవీ (రెయిన్ బో) లోనూ రష్మిక నటిస్తోంది.
ప్రస్తుతానికి తెలుగులో రష్మిక చేతిలో వున్న ప్రాజెక్టులివే. అయితే, తాజాగా అందుతోన్న సమాచారం ప్రకారం, ఓ చిన్న హీరో సినిమాకి రష్మిక మండన్నా ఓకే చేసినట్లు తెలుస్తోంది.
ఆయన మరెవరో కాదు, ‘డీజె టిల్లు’ ఫేమ్ సిద్దు జొన్నలగడ్డ. ప్రస్తుతం ‘టిల్లు స్క్వేర్’లో నటిస్తున్న సిద్దు జొన్నలగడ్డ.. కొత్త సినిమా కోసం హీరోయిన్‌గా ఓ పాపులర్ హీరోయిన్ కోసం వేటాడుతున్నాడట.
ఆ క్రమంలోనే రష్మిక మండన్నాకి భారీ రెమ్యునరేషన్ ఆఫర్ చేసి, తన సినిమాలో హీరోయిన్‌గా ఫిక్స్ చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. చూడాలి మరి ఈ ప్రచారంలో నిజమెంతో.!
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







