బహ్రెయిన్‌లో ‘సిజిలాట్ 3.0 సిస్టమ్’ ప్రారంభం

- August 03, 2023 , by Maagulf
బహ్రెయిన్‌లో ‘సిజిలాట్ 3.0 సిస్టమ్’ ప్రారంభం

బహ్రెయిన్: బహ్రెయిన్‌లో వ్యాపారాన్ని సులభతరం చేయడానికి సిజిలాట్ 3.0 సిస్టమ్ ను ప్రారంభించారు. దీని ద్వారా వ్యాపారాలు తమ వాణిజ్య రిజిస్ట్రేషన్‌ల కోసం దరఖాస్తు చేసుకోవడంతోపాటు పునరుద్ధరించవచ్చు. బహ్రెయిన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (BCCI)లో జరిగిన సిజిలాట్ 3.0 ప్రారంభోత్సవానికి పరిశ్రమ, వాణిజ్య మంత్రి అబ్దుల్లా బిన్ అడెల్ ఫఖ్రో హాజరయ్యారు.  బిసిసిఐ ఛైర్మన్ సమీర్ అబ్దుల్లా నాస్, ఐజిఎ సిఇఒ మహ్మద్ అలీ అల్ ఖైద్, ఐజిఎ డిప్యూటీ సిఇఒ డాక్టర్ జకారియా అహ్మద్ అల్ ఖాజా, ఎంఓఐసిలో కమర్షియల్ రిజిస్ట్రేషన్ అండ్ కంపెనీల అసిస్టెంట్ అండర్ సెక్రటరీ నిబ్రాస్ మహమ్మద్ అలీ తాలిబ్ లు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

వాణిజ్య రిజిస్ట్రేషన్ సిస్టమ్ "సిజిలాట్" అనేది బహ్రెయిన్, గల్ఫ్ మరియు అంతర్జాతీయ పెట్టుబడిదారులను ఆకర్షించే వాణిజ్య పెట్టుబడి వాతావరణాన్ని అందించడానికి,  వాణిజ్య ప్రాజెక్టుల స్థాపనకు..  వాణిజ్య కార్యకలాపాలకు సంబంధించిన ఒక సమగ్ర ఎలక్ట్రానిక్ పోర్టల్. హిజ్ మెజెస్టి కింగ్ హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫా నేతృత్వంలోని సమగ్ర అభివృద్ధి ప్రక్రియలో భాగంగా ఆర్థిక మరియు వాణిజ్య రంగాలను ప్రోత్సహించే కార్యక్రమాలను అభివృద్ధి చేయడానికి మంత్రిత్వ శాఖ నిబద్ధతతో పనిచేస్తుందని మంత్రి వెల్లడించారు.  సిజిలాట్ 3.0 ప్రారంభించడం ద్వారా పరిశ్రమ, వాణిజ్య మంత్రిత్వ శాఖ అందించే సేవల నాణ్యతను మరింత అభివృద్ధి చేయడం మరియు మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకున్నామని, పెట్టుబడిదారులు తమ వ్యాపారాలను సులభంగా, ప్రపంచంలో ఎక్కడి నుండైనా నిర్వహించడానికి వీలు కల్పించే సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని అమలు చేస్తున్నట్లు ఫఖ్రో తెలిపారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com