20 మిలియన్ దిర్హామ్‌లను గెలుచుకున్న భారతీయ ప్రవాసుడు
- August 03, 2023
యూఏఈ: గత రెండు సంవత్సరాలుగా మహ్జూజ్ డ్రాలో పాల్గొంటూ రాఫెల్స్‌లో 25,000 దిర్హామ్‌లకు పైగా ఖర్చు చేసిన తర్వాత దుబాయ్‌లోని ఒక భారతీయ ప్రవాసుడు చివరకు 20 మిలియన్ దిర్హామ్‌ల జాక్‌పాట్‌ను కొట్టాడు. ఆర్కిటెక్చరల్ సంస్థలో పని చేస్తున్న 47 ఏళ్ల సచిన్ 2022లో మహ్జూజ్ డ్రా ప్రారంభం నుండి పాల్గొంటున్నాడు. "ఈ విజయం నాకు పూర్తిగా షాక్ ఇచ్చింది. ఈ వార్త నా జీవితాన్ని మార్చేసింది. మహ్జూజ్ అధికారుల నుండి నాకు కాల్ వచ్చినప్పటి నుండి నేను నిద్రపోలేకపోతున్నాను" అని ముంబైకి చెందిన సచిన్ తెలిపారు. "నేను గెలిచిన డబ్బుతో, నా పిల్లలకు మంచి భవిష్యత్తును అందించాలని ఆశిస్తున్నాను. పెట్టుబడి మరియు ఖర్చుపై నేను ఇంకా నిర్ణయించుకోలేదు." అని పేర్కొన్నారు. పిల్లిని దత్తత తీసుకున్న తర్వాత అదృష్టం వచ్చిందన్నారు. శనివారం ఉదయం పిల్లిని దత్తత తీసుకోగా.. అదే రోజు సాయంత్రం జాక్‌పాట్ కొట్టినట్టు సమాచారం అందిందని సచిన్ తెలిపారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







