రక్తదానాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది: కువైట్
- August 03, 2023
కువైట్: ప్రాణాలను కాపాడేందుకు రక్తదాన సంస్కృతిని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. జీవితాలను రక్షించడానికి, ఆరోగ్య సేవల అభివృద్ధికి రక్తదాన సంస్కృతిని ప్రోత్సహించాలని విదేశీ ఆరోగ్య సేవల వ్యవహారాల MoH అసిస్టెంట్ అండర్ సెక్రటరీ డాక్టర్ యాకూబ్ అల్-తమర్ చెప్పారు. రక్త మార్పిడికి సంబంధించిన సేవలకు మంత్రిత్వ శాఖ ఎల్లప్పుడూ మద్దతునిస్తుందన్నారు. ఏడాది పొడవునా రక్తదానం మరియు ప్రచారాలను నిర్వహించాల్సిన అవసరం గురించి అవగాహన పెంచడానికి కృషి చేస్తుంది. ఏటా అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం రక్తదానంపై అవగాహన కల్పిస్తుందన్నారు. అన్ని రోజులలో రక్త దాతలు క్రమం తప్పకుండా రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది రక్తదానాల సంఖ్య 60 శాతం పెరిగిందన్నారు.
తాజా వార్తలు
- సైనిక ప్రతీకారం 'కచ్చితంగా' చర్చకు వస్తుంది: యూఏఈ అధ్యక్షుడి దౌత్య సలహాదారు అన్వర్ గార్గాష్
- భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు
- టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడికి హైదరాబాద్ కోర్టులో ఊరట
- తెలంగాణ లో మహిళా పెట్రోల్ బంకులు
- ఇద్దరు ఇరానియన్ రివల్యూషనరీ గార్డ్ సెల్స్ అరెస్ట్: ఖతార్
- 166 మిస్సైల్స్, డ్రోన్లను ధ్వంసం చేశాం: బహ్రెయిన్
- కువైట్ పై దాడులకు తెగబడ్డ ఇరాన్..!!
- కువైట్లో సైనికుల మృతి పట్ల ఒమన్ సంతాపం..!!
- దౌత్యాధికారులకు ఇఫ్తార్ విందు ఇచ్చిన సౌదీ అరేబియా..!!
- డిస్టెన్స్ లెర్నింగ్ మార్చి 6 వరకు పొడిగించిన యూఏఈ..!!









