తెలంగాణ అసెంబ్లీ రేపటికి వాయిదా
- August 03, 2023
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలను స్పీకర్ వాయిదా వేశారు. సభ ప్రారంభమయ్యాక దివంగత ఎమ్మెల్యే సాయన్నకు సంతాపం తెలుపుతూ ఆయన చేసిన సేవలను సిఎం కెసిఆర్, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, బిజెపి ఎమ్మెల్యే రఘునందన్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, ప్రశాంత్ రెడ్డి, దానం నాగేందర్, ఇతర ఎమ్మెల్యేలు స్మరించుకున్నారు. అనంతరం రెండు నిమిషాలు మౌనం పాటించి సభను రేపు 10 గంటలకు వాయిదా వేశారు. కాగా, మరికాసేపట్లో స్పీకర్ పోచారం శ్రీనివాస్ నేతృత్వంలో బీఏసీ సమావేశం జరుగనున్నది. ఈ సందర్భంగా సమావేశాలు ఎన్నిరోజులపాటు నిర్వహించాలి, ఏయే అంశాలపై చర్చించాలనే అంశాలను నిర్ణయించనున్నారు.
తాజా వార్తలు
- ఫోన్‌పే చేసేవారికి బిగ్ అలర్ట్..
- శ్రీవారిని దర్శించుకున్న మారిషస్ దేశ ప్రధాని
- కరీంనగర్ పాస్‌పోర్ట్ కార్యాలయానికి నూతన రూపం
- భద్రతా సహకారంపై సౌదీ, కువైట్ చర్చలు..!!
- ఖతార్ లో వర్క్ బ్యాన్ తొలగింపు..!!
- ఆన్లైన్ ద్వారా పిల్లలపై లైంగిక వేధింపులు..8మంది అరెస్టు..!!
- ఆషెల్ సాలరీ ట్రాన్స్ ఫర్ పై చర్చించిన PAM, బ్యాంకులు..!!
- అమానా హెల్త్ కేర్ ఫెసిలిటీని సందర్శించిన NHRA చీఫ్..!!
- ఘాలా వేర్ హౌజ్ లో అగ్నిప్రమాదం..!!
- WhatsApp ద్వారా ఆధార్ కార్డు డౌన్లోడ్ చేయడం