నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్న్యూస్..
- August 03, 2023
అమరావతి: నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. మరికొన్ని పోస్టుల భర్తీకి సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వర్సిటీలు, ట్రిపుల్ ఐటీల్లో రెగ్యులర్ సిబ్బంది నియామకానికి అనుమతి ఇచ్చారు. 3 వేల 295 పోస్టుల భర్తీకి ఆమోదముద్ర వేశారు. వీటిని ఏపీపీఎస్సీ(APPSC) ద్వారా భర్తీ చేయనున్నారు. 2వేల 635 అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులతో పాటు ట్రిపుల్ ఐటీల్లో 660 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. నవంబర్ 15 నాటికి నియామక ప్రక్రియ పూర్తి చేయాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు.
ట్రిపుల్ ఐటీల్లో 660 పోస్టులు ఉండగా.. వీటిలో లెక్చరర్లు, ప్రొఫెసర్ల కొలువులు ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా అన్ని యూనివర్సిటీల్లో ఉన్న ఖాళీలన్నీ భర్తీ చేయాలని సీఎం జగన్ అధికారులను సూచించారు. ఇప్పటికే కాంట్రాక్ట్ పద్ధతిలో పని చేస్తున్న వారికి ఏడాదికి ఒక మార్కు చొప్పున గరిష్టంగా 10 మార్కులు ఇంటర్వ్యూలో వెయిటేజ్ ఇవ్వాలని నిర్ణయించారు. విశ్వవిద్యాలయాల్లో నాణ్యమైన విద్య ఉండాలంటే పూర్తిస్థాయిలో ఖాళీలన్నీ భర్తీ చేయాలని సీఎం జగన్ చెప్పారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







