తిరుమలలో టోకెన్లు లేని యాత్రికులకు 12 గంటల్లో సర్వదర్శనం
- August 03, 2023
తిరుమల: తిరుమలలో యాత్రికుల రద్దీ సాధారణంగా కొనసాగుతుంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన యాత్రికులు 9 కంపార్ట్‌మెంట్లలో వేచియున్నారు.టోకెన్లు లేని యాత్రికులకు 12 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని టీటీడీ అధికారులు వివరించారు. స్వామివారిని బుధవారం 69,365 మంది యాత్రికులు దర్శించుకోగా 26,006 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. యాత్రికులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ.3.05 కోట్లు వచ్చిందని వివరించారు. ప్రతి నెల నిర్వహించే డయల్ యువర్ ఈవో కార్యక్రమం ఆగస్టు 4న ఉదయం 9 నుంచి 10 గంటల వరకు కొనసాగుతుందని అధికారులు వివరించారు. తిరుమల అన్నమయ్య భవనంలో జరిగే కార్యక్రమానికి యాత్రికులు తమ సందేహాలను, సూచనలను టీటీడీ ఈవో ఎవి.ధర్మారెడ్డికి తెలియజేయవచ్చని పేర్కొన్నారు. ఇందుకు యాత్రికులు 0877-2263261 అనే నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల