డిజాస్టర్ అనిపించుకుంటూనే.. అందరి లెక్కలూ తీర్చేస్తున్నావ్ ‘బ్రో’.!
- August 03, 2023
తమిళ మూవీ ‘వినోదియసితం’కి రీమేక్‌గా ఎలాంటి అంచనాలు లేకుండా తెరకెక్కిన ‘బ్రో’ మూవీ సెన్సేషనల్ హిట్ అయిన సంగతి తెలిసిందే. అయితే, రాజకీయ కోణంలో ఈ సినిమాని డిజాస్టర్ అంటూ ప్రమోట్ చేస్తున్నారు.
కానీ, గ్రౌండ్ లెవల్లో ఈ సినిమా కేవలం ఐదు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ అయిపోయిందన్నది ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. కాగా, రాజకీయ రచ్చ ఈ సినిమాలో బీభత్సంగా పెరిగిపోతోంది. ఓ రాజకీయ ప్రముఖుడికి సంబంధించిన పాత్రను ఈ సినిమాలో అనుకరించారన్న ఆరోపణతో తెగ రచ్చ రచ్చ చేస్తున్నారు.
సినిమా రివ్యూల కన్నా, రాజకీయ రివ్యూలు ఈ సినిమాని మరింత ప్రమోట్ అయ్యేలా చేస్తున్నాయని చెప్పొచ్చేమో. దాంతో, ఇప్పుడు ఎక్కడ విన్నా ‘బ్రో’ ముచ్చటే. అలా సినిమాకి ఫ్రీ పబ్లిసిటీ రావడంతో పాటూ, డిజాస్టర్ టాక్ కాస్తా, బ్లాక్ బస్టర్‌గా ఫైర్‌లోకి వచ్చేసింది.
అంతేకాదు, ‘బ్రో’ నిర్మాత టీజీ విశ్వప్రసాద్ కూడా ఈ సినిమా విషయంలో అస్సలు తగ్గేదే లే అంటున్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఓ నిర్మాత.. సినిమాకి సంబంధించి ఇంటర్వ్యూల మీద ఇంటర్వ్యూలు ఇవ్వడం.. అవి కాస్తా కాంట్రవర్సీలు కావడం.. అదే సినిమాకి మరింత లాభం చేకూర్చడం.. ఇలా ‘బ్రో’ విషయంలో ఏదేదో జరుగిపోతోంది.
ఈ క్రమంలోనే ‘బ్రో’ సినిమాకి పెట్టిన బడ్జెట్ లెక్కలూ, పవన్ కళ్యాణ్ రెమ్యునరేషన్ లెక్కలూ.. నిర్మాతకు వచ్చిన లాభాల లెక్కలూ.. ఒక్కటేంటీ.. ఎన్నో ఆసక్తికరమైన విషయాలు బయటికొస్తున్నాయ్.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి