భోళా శంకర్’ మేనియా స్టార్ట్స్.!

- August 03, 2023 , by Maagulf
భోళా శంకర్’ మేనియా స్టార్ట్స్.!

ఆగస్టు 11న మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘భోళా శంకర్’ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాపై రెండు తెలుగు రాష్ర్టాల్లోనూ భారీగా అంచనాలున్నాయ్. 
ఇప్పటికే రిలీజ్ చేసిన ప్రచార చిత్రాలు సినిమాపై అంచనాల్ని అంతకంతకూ పెంచేస్తున్నాయ్. తాజాగా సెన్సార్ బోర్డ్ ఈ సినిమాకి ‘యు బై ఏ’ సర్టిఫికెట్ ఇచ్చింది. చిరంజీవి రెట్టించిన ఉత్సాహంతో ఈ సినిమాలో కనిపిస్తున్నట్లు ప్రచార చిత్రాలు ప్రూవ్ చేస్తున్నాయ్.
అలాగే ఫ్యాన్స్‌కి అసలు సిసలు మెగా ఫీస్ట్‌గా ‘భోళా శంకర్’ వుండబోతోందనీ అంటున్నారు. చిరంజీవి సూపర్ హిట్ మూవీస్‌లో ఒకటైన ‘శంకర్ దాదా ఎమ్‌బిబిఎస్’ సినిమాతో ఈ సినిమాని పోల్చుతున్నారు. 
అంటే, ఈ సినిమాలో ఎంటర్‌టైన్‌మెంట్ ఆ రేంజ్‌లో వుండబోతోందనీ తెలుస్తోంది. హ్యూమన్ ట్రాఫికింగ్ నేపథ్యంలో ‘భోళా శంకర్’ కథ వుండబోతున్న సంగతి తెలిసిందే. తమిళ బ్లాక్ బస్టర్ ‘వేదాళం’కి రీమేక్‌గా రూపొందుతోన్న ఈ సినిమాకి మెహర్ రమేష్ దర్శకత్వం వహించారు. మిల్కీ బ్యూటీ తమన్నా, మహా నటి కీర్తి సురేష్ ఫీమేల్ లీడ్ రోల్స్ పోషించారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com