మా గల్ఫ్‌తో చేతులు కలిపిన వెస్ట్‌ఫోర్డ్ ఎడ్యుకేషన్ గ్రూప్

- August 04, 2023 , by Maagulf
మా గల్ఫ్‌తో చేతులు కలిపిన వెస్ట్‌ఫోర్డ్ ఎడ్యుకేషన్ గ్రూప్

దుబాయ్: తెలుగు మాట్లాడే భారతీయ ప్రవాసుల కమ్యూనిటీకి మేనేజ్‌మెంట్, టీచింగ్, టెక్నాలజీలో అకాసియా యూనివర్సిటీ ప్రొఫెషనల్ డెవలప్‌మెంట్ కోర్సులను అందించడానికివెస్ట్‌ఫోర్డ్ ఎడ్యుకేషన్ గ్రూప్, ఆన్‌లైన్ న్యూస్ పోర్టల్ మాగల్ఫ్.కామ్ (http://www.maagulf.com) తో చేతులు కలిపింది. ఈ మేరకు కుదిరిన అవగాహన ఒప్పందం (MOU)పై వెస్ట్‌ఫోర్డ్ ఎడ్యుకేషన్ గ్రూప్‌కు చెందిన డాక్టర్ బహరుల్లా సఫీ, మాగల్ఫ్.కామ్ ఎడిటర్-ఇన్-చీఫ్ శ్రీకాంత్ చిత్తర్వు, ఆపరేషన్స్ హెడ్ సౌమ్య సంతకాలు చేశారు.

ఈ సందర్భంగా డాక్టర్ బహరుల్లా సఫీ మాట్లాడుతూ.. ప్రొఫెషనల్ డెవలప్‌మెంట్ కోర్సులు మేనేజ్‌మెంట్, టీచింగ్ మరియు టెక్నాలజీతో సహా విభిన్న అవసరాలకు అనుగుణంగా అనేక రకాల అంశాలను కవర్ చేస్తాయన్నారు.  అనుభవజ్ఞులైన అధ్యాపకులచేత కోర్సులు అందించబడతాయని, ప్రముఖ విశ్వవిద్యాలయాలు, సంస్థలచే ఇవి ధృవీకరించబడ్డాయని వివరించారు. తాము మాగల్ఫ్ తో (http://www.maagulf.com)తో భాగస్వామిగా ఉన్నందుకు సంతోషిస్తున్నామని తెలిపారు.

 మాగల్ఫ్ ఎడిటర్-ఇన్-చీఫ్ శ్రీకాంత్ చిత్తర్వు మాట్లాడుతూ.. తాము వెస్ట్‌ఫోర్డ్ ఎడ్యుకేషన్ గ్రూప్‌తో భాగస్వామిగా ఉండి తెలుగు మాట్లాడే కమ్యూనిటీ సభ్యులకు ప్రొఫెషనల్ డెవలప్‌మెంట్ కోర్సులను అందించడానికి సంతోషిస్తున్నామన్నారు. తాము కమ్యూనిటీ సభ్యులకు అందిస్తున్న సేవలకు, నిబద్ధతకు ఈ భాగస్వామ్యం నిదర్శనమని తెలిపారు. ఇది తమ సభ్యులు వారి నైపుణ్యాలను, జ్ఞానాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుందని వివరించారు. అదే విధంగా తమ కమ్యూనిటీ అభివృద్ధికి దోహదపడుతుందని నమ్ముతున్నట్లు పేర్కొన్నారు.

వెస్ట్‌ఫోర్డ్ ఎడ్యుకేషన్ గ్రూప్ ప్రపంచవ్యాప్తంగా ఔత్సాహిక అభ్యాసకులకు గుర్తింపు పొందిన అంతర్జాతీయ విద్యను అందించే ప్రముఖ గ్రూప్. వెస్ట్‌ఫోర్డ్ ఎడ్యుకేషన్ గ్రూప్ అండర్ గ్రాడ్యుయేట్ నుండి డాక్టోరల్ డిగ్రీల వరకు అనేక రకాల ప్రోగ్రామ్‌లను ఆఫర్ చేస్తోంది. అలాగే 6-15 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు స్పోర్ట్స్ కోచింగ్,  కోడింగ్ తరగతులు వంటి వృత్తిపరమైన కోర్సులను అందిస్తుంది. వెస్ట్‌ఫోర్డ్ ఎడ్యుకేషన్ గ్రూప్‌లో  అకాడెమియా, పరిశ్రమలకు చెందిన 500+ మంది ప్రముఖ నిపుణులు భాగస్వామ్యులుగా ఉన్నారు.   

కోర్సు వివరాలకు ఈ క్రింద లింక్ క్లిక్ చెయ్యగలరు.

https://www.acacia.edu/professional-development-programs/?utm_source=Maagulf

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com