కువైట్‌లో దంచికొడుతున్న ఎండలు. ఈ వారంతంలో 50 డిగ్రీలు దాటే అవకాశం

- August 04, 2023 , by Maagulf
కువైట్‌లో దంచికొడుతున్న ఎండలు. ఈ వారంతంలో 50 డిగ్రీలు దాటే అవకాశం

కువైట్: ఈ వారంతంలో కువైట్ లోని కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 50 డిగ్రీల సెల్సియస్ ను దాటే అవకాశం ఉందని కువైట్ వాతావరణ శాఖ అంచనా వేసింది.  డిపార్ట్‌మెంట్‌లోని చీఫ్ మెరైన్ ఫోర్‌కాస్టర్ యాసర్ అల్-బ్లౌషి మాట్లాడుతూ.. వేడి గాలులు కువైట్ అంతటా ప్రభావం చూపుతాయని, కొన్ని చోట్ల దుమ్ము తుఫాన్లు చెలరేగే అవకాశం కూడా ఉందన్నారు. అత్యధిక ఉష్ణోగ్రత 51 డిగ్రీలకు చేరుకునే అవకాశం ఉందని, తర్వాత రోజులలో అది 49 డిగ్రీలకు తగ్గుతుందని అంచనా వేశారు. రాత్రి వేళల్లో ఉష్ణోగ్రతలు 35-27 డిగ్రీల స్థాయికి తగ్గుతుందని పేర్కొన్నారు. అలాగే శుక్రవారం, ఉష్ణోగ్రత 47-49 డిగ్రీల స్థాయికి చేరుతుందని, కనిష్టంగా 33-35 డిగ్రీల పరిధిలో ఉంటుందన్నారు. శనివారం గరిష్ఠ ఉష్ణోగ్రతలు 50-48 డిగ్రీల స్థాయిలో ఉంటుందని, రాత్రి సమయంలో అత్యల్పంగా 32-35 డిగ్రీల వద్ద ఉంటుందని అల్-బ్లౌషి చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com