హిట్ డైరెక్టర్‌ని లైన్‌లో పెట్టిన చైతూ.!
- August 04, 2023
‘లవ్ స్టోరీ’ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన అక్కినేని హీరో నాగ చైతన్యకు, ‘కస్టడీ’ రూపంలో ఫెయిల్యూర్ దెబ్బ తగిలింది. దాంతో, తదుపరి సినిమా విషయంలో కాస్త ఆచి తూచి అడుగులేయబోతున్నాడు.
ఆ నేపథ్యంలోనే చందూ మొండేటితో చేతులు కలిపాడు. గతంలో ‘సవ్యసాచి’ సినిమాలో నటించాడు చందూ మొండేటి దర్శకత్వంలో నాగ చైతన్య. తాజాగా ‘కార్తికేయ 2’ సినిమాతో సెన్సేషనల్ హిట్ అందుకున్నాడు డైరెక్టర్‌గా చందూ మొండేటి.
ఇటీవల చైతూ వద్దకు ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ పట్టుకుని వచ్చాడట. వైజాగ్ పోర్ట్ నేపథ్యంలో మత్స్యారుల జీవితాలకు సంబంధించిన కాన్సెప్ట్ అనీ తెలుస్తోంది. ఈ కథ చైతూకి బాగా నచ్చిందట. దాంతో, ఆ సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట.
త్వరలోనే ఈ ప్రాజెక్ట్ సెట్స్ మీదికెళ్లనుందనీ తెలుస్తోంది. ఈ లోపు కథకు అనుగుణంగా వైజాగ్ పోర్టు వద్ద మత్స్యకారుల జీవితాలకు సంబంధించిన ఆసక్తికరమైన విషయాల్ని తెలుసుకోవడంలో ఇటు డైరెక్టర్, అటు చైతూ ఇద్దరూ బిజీ అయిపోయారట. చూడాలి మరి, ఇంతవరకూ చైతూ టచ్ చేయని ఈ డిఫరెంట్ సబ్జెక్ట్‌తోనైనా హిట్టు కొడతాడేమో.!
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







