ఫిలాసపీ మాట్టాడుతోన్న మెగా డాటర్.! అసలేం జరిగింది.?
- August 04, 2023
మెగా డాటర్ నిహారిక విడాకులు తీసుకుంటున్నట్లుగా ఇటీవల అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. గత కొంత కాలంగా నిహారిక విడాకులు తీసుకుంటోందట.. అనే వార్త అనవరసరంగా దుష్ప్రచారంగా మారింది. అయితే, ఎట్టకేలకు ఆ విషయాన్ని నిహారిక కొణిదెల డిక్లేర్ చేయడంతో, ఆయా గాలి వార్తలకు చెక్ పడింది.
తాజాగా నిహారిక సోషల్ మీడియా వేదికగా పెట్టిన పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. విడాకులు తీసుకోవడం అనేది ఆమె పర్సనల్ విషయం. ఈ విషయాన్ని వక్రీకరిస్తూ మీడియాలో పలు కథనాలు వెలువడ్డాయ్. అవి కొన్నిసార్లు నిహారికను బాధించేలా చేశాయని చెబుతోంది.
పర్సనల్ లైఫ్‌లోకి రావద్దని ఎంత చెప్పినా మీడియా పట్టించుకోవడం లేదు. జీవితం ఎటు వెళితే అటు ప్రయాణించడమే.. అలా కాదని ఇలాగే వెళ్లాలి.. ఇదే చెయ్యాలి.. అంటే అక్కడే ఆగిపోతాం.. ముందుకు వెళ్లలేం.. అంటూ ఆ పోస్ట్‌లో నిహారిక రాసుకొచ్చింది. గాలి వార్తలు ఎంతలా నిహారికను బాధించాయో.. అందుకు తాను ఇచ్చిన ఈ ఎక్సప్లనేషన్‌తో కూడిన ట్వీటే నిదర్శనం.
ప్రస్తుతం అన్నీ మర్చిపోయి నిహారిక సినిమాల్లో నటించేందుకు మళ్లీ ముందుకొచ్చింది. ఆల్రెడీ ఇటీవల ‘డెడ్ పిక్సల్స్’ అనే వెబ్ సిరీస్‌లో నటించింది. త్వరలో మరిన్ని మంచి ప్రాజెక్టుల్లో నిహారిక కనిపించబోతోందనీ తెలుస్తోంది.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







