డెంగ్యూ ఫీవర్‌తో వచ్చిన నీరసాన్ని తగ్గించుకోవాలంటే.!

- August 04, 2023 , by Maagulf
డెంగ్యూ ఫీవర్‌తో వచ్చిన నీరసాన్ని తగ్గించుకోవాలంటే.!

సీజనల్ మార్పులో భాగంగా డెంగ్యూ జ్వరాలు జనాల్ని అతలాకుతలం చేస్తున్నాయ్. దోమల కారణంగా వ్యాప్తి చెందే డెంగ్యూ జ్వరం కారణంగా ప్లేట్‌లెట్స్ దారుణంగా పడిపోతాయ్. దాంతో విపరీతమైన నీరసం, హై టెంపరేచర్‌తో పాటూ, కొన్నిసార్లు ప్రాణాపాయ పరిస్థితి కూడా తలెత్తవచ్చు.

ఇలాంటి పరిస్థితుల్లో వైద్యుని చికిత్స ఖచ్చితంగా అవసరం. వైద్యుని పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటూనే కొన్ని రకాల ఫుడ్ ఛేంజెస్ చేసుకోవడం ద్వారా డెంగ్యూ నుంచి త్వరగా కోలుకోవచ్చు.

డెంగ్యూ ఫీవర్ వచ్చినప్పుడు ఆకు కూరలు ఎక్కువగా తీసుకోవాలి. అలాగే, పండ్లలో బొప్పాయిని ప్రధానంగా తినాలి. బొప్పాయి పండుతో పాటూ, ఆకుల రసాన్ని కూడా తాగుతుండాలి. పైనాపిల్ పండు కూడా ఈ సమయంలో మంచి శక్తినిస్తుంది. ప్లేట్‌లెట్స్ పెరగాలంటే, విటమిన్ ఏ,కే,బీ 12, సీ ఎక్కువగా వుండే పండ్లు, కూరగాయలను తినాలి. నారింజ, యాపిల్, బత్తాయి పండ్లలో ఈ విటమిన్లు అధికంగా లభిస్తాయ్.

క్యారెట్, బీట్ రూట్‌తో పాటూ, గుమ్మడికాయ, చిలగడ దుంపల్ని కూడా తింటే మంచిది. ఉసిరి కాయతో చేసిన ఆహారాన్ని తీసుకోవడం వల్ల మంచి ఫలితం వుంటుందని చెబుతున్నారు.

డెంగ్యూ జ్వరాన్ని అస్సలు నిర్లక్ష్యం చేయరాదు. నిర్దేశిత సమయంలో వైద్యుని సలహా తీసుకుని, సహజ సిద్ధమైన ఆహారాన్ని టైమ్ టు టైమ్ తీసుకోవడం ద్వారా డెంగ్యూ నుంచి త్వరగా కోలుకునే అవకాశముంటుది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com