మార్గదర్శి కేసు..ఏపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ
- August 04, 2023
న్యూఢిల్లీ: మార్గదర్శి చిట్ ఫండ్స్ కేసులో ఏపీ ప్రభుత్వానికి నిరాశ ఎదురయింది. ఈ సంస్థకు చెందిన కేసులను తెలంగాణ హైకోర్టు నుంచి ఏపీకి బదిలీ చేయాలని కోరుతూ ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. కేసు న్యాయపరిధి అంశాన్ని హైకోర్టులోనే తేల్చుకోవాలని సూచించింది. మరోవైపు మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్ పై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోకూడదంటూ తెలంగాణ హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులపై జోక్యం చేసుకోబోమని స్పష్టం చేసింది. కేసును విచారించి తీర్పును వెలువరించే స్వేచ్ఛను తెలంగాణ హైకోర్టుకే వదిలేస్తూ జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ కేవీ విశ్వనాథన్ లతో కూడిన ధర్మాసనం తీర్పును వెలువరించింది.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







