బహ్రెయిన్ లో రికార్డు స్థాయిలో విద్యుత్ వినియోగం..!
- August 05, 2023
బహ్రెయిన్: బహ్రెయిన్ లో రికార్డు స్థాయిలో విద్యుత్ వినియోగం నమోదైంది. వేసవి ఉష్ణోగ్రతలు పెరగడం కారణంగా ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్‌ల వినియోగం పెరగడంతో విద్యుత్ వినియోగం పెరిగిందని అధికారులు తెలిపారు. అత్యంత ఉష్ణోగ్రతలు నమోదవుతున్న ప్రాంతాలలో ఒకటైన మనామా పరిధిలో గురువారం 3,798 మెగావాట్ల అత్యధిక విద్యుత్ వినియోగ రేటును నమోదు అయిందని మనామా విద్యుత్ మరియు నీటి అథారిటీ వెల్లడించింది. గత సంవత్సరం 3,708 మెగావాట్ల రికార్డును అధిగమించడం విశేషం. గురువారం నాడు స్థానికంగా ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్ (104 డిగ్రీల ఫారెన్‌హీట్)కు చేరుకున్నాయి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఈ ఏడాది చివర్లో ఐక్యరాజ్యసమితి వాతావరణ శిఖరాగ్ర సమావేశానికి ఆతిథ్యం ఇవ్వడానికి సిద్ధమవుతున్నందున వాతావరణ మార్పుల ప్రభావాలను తగ్గించే ప్రయత్నాలు గల్ఫ్‌లో వేగం పుంజుకున్నాయి. COP28 నవంబర్, డిసెంబర్లలో యూఏఈ వ్యాపార కేంద్రమైన దుబాయ్‌లో జరుగుతుంది.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!
- ఒంటెల ఆరోగ్యంపై అంతర్జాతీయ సదస్సు.. 12 మంది ప్రముఖులకు తుంబే గ్రూప్ సత్కారం
- తెలంగాణ ఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్, కేసీఆర్
- యూఏఈలో విద్యా సంస్థల స్థాపకుడు భారతీయ ఎన్ఆర్ఐ కన్నుమూత
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!







