కువైట్ లో నర్స్ రిక్రూట్మెంట్ పేరిట భారీ మోసం. ముంబైలో ఈడీ రైడ్స్
- August 05, 2023
కువైట్ : కువైట్‌కు నర్సింగ్ రిక్రూట్మెంట్ పేరుతో కోట్లాది రూపాయలను అక్రమంగా వసూలు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మాథ్యూ ఇంటర్నేషనల్ రిక్రూట్మెంట్ సంస్థను నడుపుతున్న పుతేన్వీటిల్ జోసెఫ్ మాథ్యూ నివాసం , వ్యాపార ప్రాంగణంలో భారత ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) గురు, శుక్రవారాల్లో సోదాలు నిర్వహించింది. ముంబయి, కేరళలోని పలు ప్రాంతాల్లో జరిపిన సోదాల్లో మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద రూ.76 లక్షలు, రూ.12 కోట్ల విలువైన ఆస్తి పత్రాలను ఏజెన్సీ స్వాధీనం చేసుకుంది. సిబిఐ కొచ్చిలో మాథ్యూ , ఇతరులపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడి దర్యాప్తు కొనసాగిస్తోంది. ఈడీ ప్రకారం.. మాథ్యూ అతని కుమారుడు థామస్ మాథ్యూ, అలియాస్ టామ్ మాథ్యూ, మోసపూరితంగా పొందిన లైసెన్స్‌ను ఉపయోగించి కువైట్ ఆరోగ్య మంత్రిత్వ శాఖకు నర్సులను రిక్రూట్ చేయడానికి మరో ముంబై వ్యాపారవేత్తతో కలిసి 2015లో నేరపూరిత కుట్ర పన్నారు. రిక్రూట్మెంట్ ప్రక్రియ కోసం మాథ్యూ కువైట్‌లోని రెండు కంపెనీల నుండి డిమాండ్ లెటర్లు, ఆథరైజేషన్ లెటర్లను పొందాడు. ఈ కుట్రలో కొచ్చిలోని ప్రొటెక్టర్ ఆఫ్ ఎమిగ్రెంట్స్ అడాల్ఫస్ కూడా చేరినట్లు విచారణలో తేలింది. కొచ్చిలో రిక్రూట్మెంట్ డ్రైవ్ నిర్వహించి ఒక్కో అభ్యర్థి నుంచి సుమారు రూ.20 లక్షల వరకు సర్వీస్ ఛార్జీలు కింద వసూలు చేశారు. సర్వీస్ ఛార్జీకి గరిష్టంగా సూచించిన పరిమితి రూ. 20,000 మాత్రమే. మొత్తంగా, మాథ్యూ మరియు అతని సహచరులు బాధితులను రూ. 205.71 కోట్ల మేర మోసం చేశారని ఈడీ తెలిపింది.
తాజా వార్తలు
- చైనాలో అధికారిక పర్యటనకు అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖాలెద్ బీజింగ్ చేరిక
- ముంబై పై బెంగళూరు ఘన విజయం
- ఐటీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్..
- లక్నో పై గుజరాత్ ఘన విజయం
- స్కామ్ వివాదం పై నోరువిప్పిన సింగర్ మంగ్లీ
- భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌కు యూఏఈ అధ్యక్షుడు ఘన స్వాగతం..
- ట్రంప్ సంచలన ప్రకటన..
- అమరనాథ్ యాత్ర తేదీలు ఖరారు..
- తిరుమల శ్రీవారి జులై నెల సేవా టికెట్ల విడుదల
- ఈస్ట్-వెస్ట్ పైప్‌లైన్ ఫుల్ పంపింగ్ సామర్థ్యం పునరుద్ధరణ..!!









