జేడీ చక్రవర్తి.! అస్సలు ‘దయ’ చూపించలేదు.!
- August 05, 2023
సినిమాల్లో ఏముంటుంది. అసలు సిసలు టాలెంట్, కంటెంట్ వెబ్ సిరీస్‌లలోనే వుంటుంది. ఇదీ నేటి సినీ ప్రియుల అభిప్రాయం. అవును నిజమే, కొన్ని రకాల వెబ్ కంటెంట్ అంత బాగా డిజైన్ చేస్తున్నారు మరి.
తాజాగా సీనియర్ హీరో జేడీ చక్రవర్తి, ఈషా రెబ్బ జంటగా ‘దయ’ అనే వెబ్ సిరీస్ హట్ స్టార్‌లో స్ర్టీమింగ్ అవుతోంది.
స్టార్టింగ్ నుంచీ గ్రిప్సింగ్‌గా, ఇంట్రెస్టింగ్‌గా సాగింది ‘దయ’ వెబ్ సిరీస్. అక్కడక్కడా ట్విస్టులు.. హీరో ఎలివేషన్లు.. చిన్న చిన్న సర్‌ప్రైజింగ్ ఎలిమెంట్లూ.. ఇలా చివరి వరకూ ఏం జరుగుతుందన్న ఉత్కంఠతోనే నడిపించారు సిరీస్‌ని.
అయితే, క్లైమాక్స్లలో మాత్రం తేల్చేశారు. అసంపూర్తిగా అనిపించినట్లుగా వదిలిపెట్టేశారు. హీరో, హీరోయిన్ రోల్స్‌కి సంబంధించి ఏదో స్ట్రాంగ్ ఫ్లాష్ బ్యాక్ వున్నట్లు హింట్ ఇచ్చారు. కానీ, అదేంటో ఈ సీజన్‌లో మాత్రం చెప్పలేదు.
బహుశా సెకండ్ సీజన్‌పై ఆసక్తి రేకెత్తించేందుకే కాబోలు. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది ఈ సిరీస్‌కి. జేడీ చక్రవర్తి సెటిల్డ్ పర్‌ఫామెన్స్ షాక్ తెప్పిస్తుంది. ఓవరాల్‌గా ‘దయ’ ఓ న్యూ అటెంప్ట్ జేడీ చక్రవర్తికి.
తాజా వార్తలు
- ప్రధాని మోదీకి ఉజ్బెకిస్థాన్ అత్యున్నత పురస్కారం
- యూఏఈలో త్వరలో స్టార్‌లింక్.. ముందస్తు బుకింగ్ ఎలాగంటే?
- ఖతార్‌లో వరల్డ్ ఇన్వెస్ట్మెంట్ ఫోరం 2026..!!
- బహ్రెయిన్‌లోని రిఫాలో ట్రాఫిక్ రద్దీకి చెక్..!!
- గల్ఫ్ పౌరుడి హత్య కేసులో బంగ్లాదేశీయుడు అరెస్ట్..!!
- సౌదీలో ఉరుములు.. భారీ వర్షాలు.. 48 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు..!!
- ఒమన్ అక్రాస్ ఏజెస్ మ్యూజియంలో అరుదైన ఘనత..!!
- వరద ముంచుకొస్తున్న వేళ..1,643 మంది విద్యార్థుల ప్రాణాలు కాపాడిన నేపాల్ పాఠశాల ప్రిన్సిపాల్
- దోహాలో ICBF ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం
- నేపాల్-టిబెట్ వరదల్లో 750కు చేరిన మృతుల సంఖ్య.. 3,044 మంది గల్లంతు







