చైనాలో భారీ భూకంపం..

- August 06, 2023 , by Maagulf
చైనాలో భారీ భూకంపం..

చైనాలో భారీ భూకంపం సంభవించింది. ఆదివారం తెల్లవారుజామున బీజింగ్ కు 300 కిలోమీటర్ల దూరంలోని డెజౌ నగరంలో తెల్లవారుజామున 2:33 గంటలకు భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 5.5గా నమోదయినట్లు చైనా ఎర్త్ క్వేక్ నెట్ వర్క్స్ సెంటర్ వెల్లడించింది. భూకంపం ప్రభావంతో డెజౌ నగరంలో 74 ఇళ్లు నేలమట్టమయ్యాయని ప్రభుత్వ మీడియా చైనా సెంట్రల్ టీవీ ప్రకటించింది. దీంతో 10 మంది గాయపడ్డారని పేర్కొంది.

అయితే ఎలాంటి ప్రాణనష్టం జరుగలేదని తెలిపింది. భూ అంతర్భాగంలో 10 కిలో మీటర్ల లోతులో భూమి కంపించినట్లు వెల్లడించింది. కాగా, శనివారం రాత్రి ఆఫ్ఘానిస్థాన్ లో భూకంపం సంబభవించిన విషయం తెలిసిందే. రాత్రి 9:31 గంటలకు హిందూకుష్ పర్వత శ్రేణుల్లో 5.8 తీవ్రతలో భూమి కంపించింది.

ఆఫ్ఘానిస్థాన్ తో పాటు పాకిస్తాన్, జమ్మూకాశ్మీర్ సరిహద్దుల్లో 181 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం కేంద్రీకృతమైంది. అయితే దీని ప్రభావంతో ఢిల్లీ ప్రాంతంలో కూడా భూమి కంపించింది. దీంతో ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో ఇళ్ల నుంచి జనం బయటకు పరుగులు తీశారు. తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com