యూఏఈలో భారీ వర్షాలు. బీచ్‌లలో నైట్ స్విమ్మింగ్‌ బంద్

- August 07, 2023 , by Maagulf
యూఏఈలో భారీ వర్షాలు. బీచ్‌లలో నైట్ స్విమ్మింగ్‌ బంద్

యూఏఈ: ఎమిరేట్స్ వ్యాప్తంగా భారీ వర్షాల నేపథ్యంలో బీచ్‌లలో రాత్రి స్విమ్మింగ్‌ను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు దుబాయ్ మునిసిపాలిటీ ప్రకటించింది. ఆదివారం సాయంత్రం 7 గంటల నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వచ్చిందని తెలిపింది. ప్రస్తుతం ఎమిరేట్‌లో ఉన్న హెచ్చుతగ్గుల వాతావరణం నుండి రక్షణ చర్యగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. నివాసితుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు అధికార యంత్రాంగం ఒక ట్వీట్‌లో పేర్కొంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com