నేడు రవీంద్రనాథ్ ఠాగూర్ 82వ వర్ధంతి
- August 07, 2023
న్యూఢిల్లీ: బెంగాలీ సాహిత్యం, సంగీతంతో పాటు భారత ఉపఖండంలోని కళలను సందర్భోచిత ఆధునికతతో పునర్నిర్మించిన విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ 82వ వర్ధంతి నేడు. గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం 1941 ఆగస్టు 7న 80 ఏళ్ల వయసులో ఠాగూర్ మరణించారు. అయితే, బంగ్లా క్యాలెండర్‌లోని శ్రబాన్ 22న బంగ్లాదేశ్‌లో అతని వర్ధంతి జరుపుకుంటారు. ఈ దినోత్సవాన్ని పురస్కరించుకుని వివిధ ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థలు, సాంస్కృతిక సంస్థలు వివిధ కార్యక్రమాలను చేపడతాయి. బంగ్లాదేశ్ తోపాటు ఇండియా వ్యాప్తంగా ఆయన వర్ధంతి సందర్భంగా పలు కార్యక్రమాలను నిర్వహించారు.
"రబీ" అనే మారుపేరుతో పిలువబడే ఠాగూర్.. బెంగాలీ నెల బైశాఖ్ 1268 (మే 7, 1861) 25వ తేదీన కలకత్తాలోని జోరాసాంకో భవనంలో దేవేంద్రనాథ్ ఠాగూర్, శారదా దేవి దంపతులకు జన్మించాడు. బంగ్లా సాహిత్యంలోని వివిధ శైలులలో ఏడు దశాబ్దాల పాటు బంగ్లా భాష, సాహిత్యాన్ని సుసంపన్నం చేసారు. ఆయన రచించిన రాజకీయ మరియు వ్యక్తిగత అంశాలకు సంబంధించిన నవలలు, చిన్న కథలు, పాటలు, నృత్య-నాటకాలు, వ్యాసాలు ప్రపంచ వ్యాప్తంగా ప్రాచుర్యం పొందాయి.
రవీంద్రనాథ్ ఠాగూర్ రచించిన "గీతాంజలి"కి 1913లో సాహిత్యంలో నోబెల్ బహుమతిని అందుకున్నారు. దీంతో నోబెల్ అందుకున్న మొదటి బెంగాలీ, నాన్-యూరోపియన్ కవిగా గుర్తింపు పొందారు. అదే విధంగా బంగ్లాదేశ్ జాతీయ గీతం "అమర్ షోనార్ బంగ్లా", భారతదేశ జాతీయ గీతం "జన గణ మన" రెండూ రవీంద్రనాథ్ ఠాగూర్ రాసినవే కావడం విశేషం.
తాజా వార్తలు
- రైతుల ఖాతాల్లోకి ‘రైతు భరోసా’ నిధులు జమ
- తమిళనాడు సీఎం విజయ్ మరో కీలక నిర్ణయం
- TANA ప్రపంచసాహిత్య వేదిక 93వ సమావేశం ఘన విజయం
- సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో పదవీ విరమణ పొందిన పోలీసు అధికారులు
- యూఏఈలో భారత పాస్‌పోర్ట్ ఫీజులు పెంపు..
- బోయింగ్ 777-300ERSF కార్గో విమానాన్ని ప్రవేశపెట్టిన తొలి ఎయిర్‌లైన్‌గా ఎమిరేట్స్ రికార్డు
- తెలంగాణ స్పెషల్ పోలీసు పనితీరు పై డీజీపీ ఆనంద్ సమీక్ష..
- DRDO కొత్త డైరెక్టర్ జనరల్‌గా డాక్టర్ జగన్నాథ్ నాయక్
- నంద్యాలలో జనసేన పార్టీ పదవుల దరఖాస్తుల స్వీకరణ రెండో రోజు కొనసాగింపు
- ఖనిజ నిల్వల పై మినరల్ మ్యాపింగ్: సీఎం చంద్రబాబు







