దుబాయ్ లో 'హ్యాండ్లూమ్ డే' సందడి..చేనేత వస్త్రాల్లో కనువిందు చేసిన తెలుగు ఆడపడుచులు

- August 07, 2023 , by Maagulf
దుబాయ్ లో \'హ్యాండ్లూమ్ డే\' సందడి..చేనేత వస్త్రాల్లో కనువిందు చేసిన తెలుగు ఆడపడుచులు

దుబాయ్: చేనేతల దినోత్సవం పురస్కరించుకుని దుబాయిలో తెలుగు వనితలు ఇరు తెలుగు రాష్ట్రాలకు చెందిన చేనేత చీరలు కట్టుకుని సందడి చేసారు. దుబాయ్ వాస్తవ్యులు లక్ష్మీ రెడ్డి నేతృత్వంలో ఈ కార్యక్రమం ఆగస్టు 5న దుబాయిలోని ఇండియా పాలెస్ లో జరిగింది.  వెంకటగిరి, ధర్మవరం, పోచంపల్లి, ఉప్పాడ, కుప్పడం, గద్వాల్, మంగళగిరి నుండి పట్టుచీరలు కాటన్ చీరలు కట్టుకొచ్చిన వనితలు చేనేతలపై తమ మక్కువ చాటుకున్నారు.  భారతీయ చేనేతల ప్రాముఖ్యత గురించి, పవర్ లూమ్ చీరలకి హ్యాన్డ్ లూమ్ చీరలకి వ్యత్యాసం ఎలా కనిపెట్టాలి, చేనేతల ధరలు ఎందుకు హెచ్చుగా ఉంటాయి వంటి విషయాల పై వసంతలక్ష్మీ, నీలిమ ప్రసంగించారు.

లక్ష్మీరెడ్డి ద్వారా పోచంపల్లి నుండి ఒక మహిళా చేనేతకారిని, అనురాధ ద్వారా మంగళగిరి చేనేతకారిని ఈ సమూహం దత్తతు తీసుకున్నారు.  ఇకపై పోచంపల్లి మంగళగిరి చీరలు ఎప్పుడు కొనాలన్నా ఈ చేనేతకారుల ద్వారానే తీసుకుని ఈ పరిశ్రమకు తమ వంతు సహాయం సహకారం అందించాలని అంగీకరించారు.

ఈ కార్యక్రమంలో నిర్వహించిన సరదా ఆటలకు బహుమతులుగా చేనేత చీరల ఇవ్వటం విశేషం.

ఈ కార్యక్రమానికి అందిన సహకారం ప్రొత్సాహం ఎంతో ఉత్సాహాన్నిచింది అని, ముందు ముందు తెలుగు రాష్టాల చేనేత పరిశ్రమ కోసం మన వంతు కృషి ఇంకా చేయాలి అని దుబాయి తెలుగు వనితలు సంకల్పించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com