బన్నీ కోసం ఎదురు చూస్తున్న ‘అర్జున్ రెడ్డి’ డైరెక్టర్.!

- August 07, 2023 , by Maagulf
బన్నీ కోసం ఎదురు చూస్తున్న ‘అర్జున్ రెడ్డి’ డైరెక్టర్.!

‘అర్జున్ రెడ్డి’ సినిమాతో సెన్సేషనల్ డైరెక్టర్ అయిపోయాడు సందీప్ వంగా. ఇదే సినిమాని హిందీలోనూ రీమేక్ చేసి, అక్కడా బోలెడంత క్రేజ్ దక్కించుకున్నాడు. ప్రస్తుతం ‘యానిమల్’ సినిమా తెరకెక్కిస్తున్నాడు బాలీవుడ్‌లో సందీప్ రెడ్డి వంగా. 

అయితే, సందీప్ ఖాతాలో ప్రబాస్‌తో ఓ సినిమా చేయాల్సి వుంది. ‘స్పిరిట్’ అనే టైటిల్‌తో సహా ఆ సినిమాని ఎప్పుడో అనౌన్స్ చేసేశాడు సందీప్ రెడ్డి. 

అయితే, ప్రబాస్ ప్రస్తుతం వున్న బిజీ షెడ్యూల్‌లో ఈ సినిమా ఇంకా పట్టాలెక్కలేదు. ఇప్పట్లో పట్టాలెక్కే అవకాశాలు కూడా కనిపించడం లేదు. సో, సందీప్ రెడ్డి మనసు మార్చుకున్నాడట. ఆయన ఖాతాలోని మరో ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ అల్లు అర్జున్‌తో చేయాల్సి వుంది.

అల్లు అర్జున్ ప్రస్తుతం ‘పుష్ప 2’ సినిమాతో బిజీగా వున్నాడు. ఈ సినిమా ఓ కొలిక్కి రాగానే, సందీప్ రెడ్డి సినిమా కోసం డేట్స్ ఇవ్వనున్నాడట. సో, అలా సందీప్ రెడ్డి నుంచి నెక్స్‌ట్ రాబోయే చిత్రం అల్లు అర్జున్‌దే అయ్యుండొచ్చని గాసిప్ వినిపిస్తోంది. చూడాలి మరి. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com