వరద ప్రభావిత ప్రాంతాలలో సిఎం జగన్ పర్యటన
- August 07, 2023
అమరావతి: సిఎం జగన్ ఈరోజు, రేపు వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం అల్లూరి సీతారామరాజు, మంగళవారం ఏలూరు జిల్లాలో పర్యటించనున్నారు. వరద ప్రభావిత గ్రామాల ప్రజలతో నేరుగా మాట్లాడనున్నారు సీఎం జగన్. ఈ మేరకు నేడు అల్లూరి సీతారామరాజు జిల్లా కూనవరం మండలానికి చేరుకున్నారు.
మరికాసేపట్లో విఆర్ పురం మండలంలోని వరద బాధితులను పరామర్శించనున్నారు. అనంతరం 12:45 కు బయలుదేరి ఒంటి గంటకి కోతుల గుట్ట హెలిప్యాడ్ కి చేరుకుంటారు. అనంతరం 1:05 గంటలకు బయలుదేరి ఏలూరు జిల్లా కుక్కునూరు మండలం గొమ్ముగూడెం వెళతారు. అక్కడ వరద బాధిత కుటుంబాలతో సీఎం జగన్ మాట్లాడి నష్టం వివరాలు అడిగి తెలుసుకోనున్నారు.
తాజా వార్తలు
- చైనాలో అధికారిక పర్యటనకు అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖాలెద్ బీజింగ్ చేరిక
- ముంబై పై బెంగళూరు ఘన విజయం
- ఐటీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్..
- లక్నో పై గుజరాత్ ఘన విజయం
- స్కామ్ వివాదం పై నోరువిప్పిన సింగర్ మంగ్లీ
- భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌కు యూఏఈ అధ్యక్షుడు ఘన స్వాగతం..
- ట్రంప్ సంచలన ప్రకటన..
- అమరనాథ్ యాత్ర తేదీలు ఖరారు..
- తిరుమల శ్రీవారి జులై నెల సేవా టికెట్ల విడుదల
- ఈస్ట్-వెస్ట్ పైప్‌లైన్ ఫుల్ పంపింగ్ సామర్థ్యం పునరుద్ధరణ..!!









