కువైట్ లో రెండు నెలల్లో 100 మంది ప్రవాసులు బహిష్కరణ
- August 08, 2023
కువైట్: రెండు నెలల్లో తీవ్రమైన ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడినందుకు సుమారు 100 మంది నివాసితులను దేశం నుండి బహిష్కరించారు. నివేదికల ప్రకారం, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడపడం, అధిక వేగం, రోడ్లపై నిర్లక్ష్యంగా ఉండటం లేదా అక్రమంగా ప్రయాణీకులను తీసుకెళ్లడం వంటి తీవ్రమైన నేరాల కారణంగా సంబంధిత వ్యక్తులపై బహిష్కరణ వేటు వేశారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠినంగా వ్యవహరించనున్నట్టు ట్రాఫిక్ పెట్రోలింగ్ అధికారులు తెలిపారు. ఈ మేరకు తమకు అదేశాలు అందినట్టు పేర్కొన్నారు. ప్రవాస కార్మికులు ఉన్న కొన్ని ప్రాంతాలలో ఒక ప్రణాళిక బద్ధంగా డ్రైవింగ్ లైసెన్స్‌లను, వారు ఉపయోగించే వాహనాల మన్నికను తనిఖీ చేయాలని నిర్ణయించినట్టు పేర్కొన్నారు. ఎవరైనా తీవ్రమైన ఉల్లంఘనలకు పాల్పడితే దేశం నుంచి బహిష్కరిస్తామని అధికారులు హెచ్చరించారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







