‘హరి హర వీరమల్లు’ నిర్మాత సరే, డైరెక్టర్ పరిస్థితేంటీ.?
- August 08, 2023
ఏ.ఎం.రత్నం నిర్మాణంలో ‘హరి హరవీరమల్లు’ సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. క్రిష్ జాగర్లమూడి ఈ చిత్రానికి దర్శకుడు. పీరియాడిక్ బ్యాక్ డ్రాప్‌లో ఈ సినిమా రూపొందుతోన్న సంగతీ తెలిసిందే. అయితే, ప్రస్తుతం పవన్ కళ్యాణ్ రాజకీయ బిజీ షెడ్యూల్స్ కారణంగా ఈ సినిమా హోల్డ్‌లో పడింది.
కానీ, డైరెక్టర్ క్రిష్‌కీ, నిర్మాత ఏఎం రత్నానికీ పవన్‌తో విభేధాల కారణంగానే ఈ ప్రాజెక్ట్ హోల్డ్‌లో పడిందన్న దుష్ప్రచారం జరుగుతోంది. అయితే, ‘బ్రో’ ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కీ, ఏ.ఎం రత్నం హాజరవడం.. పాజిటివ్‌గా కనిపించడంతో వీరిద్దరి మధ్య ఎలాంటి విబేధాలు లేవనీ తేలింది.
కానీ, క్రిష్ మాత్రం ఇంకా దాగుడుమూతలాడుతున్నాడు ఎందుకో. అంతేకాదు, రీసెంట్‌గా ఓ యంగ్ హీరోతో క్రిష్ సినిమా అనౌన్స్ చేసేందుకు సిద్ధమయ్యాడన్న తాజా గాసిప్ కూడా తెర పైకి వచ్చింది. ఈ పరిణామాల మధ్య అసలు క్రిష్‌కీ, పవన్‌కీ మధ్య ఏం జరుగుతోందన్న విషయం తేలాల్సి వుంది.
తాజా వార్తలు
- చైనాలో అధికారిక పర్యటనకు అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖాలెద్ బీజింగ్ చేరిక
- ముంబై పై బెంగళూరు ఘన విజయం
- ఐటీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్..
- లక్నో పై గుజరాత్ ఘన విజయం
- స్కామ్ వివాదం పై నోరువిప్పిన సింగర్ మంగ్లీ
- భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌కు యూఏఈ అధ్యక్షుడు ఘన స్వాగతం..
- ట్రంప్ సంచలన ప్రకటన..
- అమరనాథ్ యాత్ర తేదీలు ఖరారు..
- తిరుమల శ్రీవారి జులై నెల సేవా టికెట్ల విడుదల
- ఈస్ట్-వెస్ట్ పైప్‌లైన్ ఫుల్ పంపింగ్ సామర్థ్యం పునరుద్ధరణ..!!









